కుంభ‌మేళాలో పాల్గొన్న వారంతా క్వారంటైన్‌లో ఉండాలి : తెలంగాణ ప్ర‌జారోగ్య సంచాల‌కులు

14-day quarantine must for Kumbh Mela returnees, Coronavirus In telangana, Kumbh Mela, Kumbh Mela Returnees, Kumbh Mela Returnees To Isolate For 14 Days, Kumbh Mela returnees to isolate themselves, Kumbh Returnees To Isolate, Mango News, Prime Minister Narendra Modi, Telangana Government, Telangana Government Directs Kumbh Mela Returnees To Isolate, Telangana Government Directs Kumbh Mela Returnees To Isolate For 14 Days Due To COVID-19 Surge

ఏప్రిల్ 1 నుండి 17 వ‌ర‌కు జ‌రిగిన కుంభ‌మేళాలో రాష్ట్రం నుంచి పాల్గొన్న వారంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా క్వారంటైన్‌లో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. “క‌చ్చితంగా 14 రోజుల పాటు కుటుంబ స‌భ్యులకు దూరంగా ఉండాలి. ఇంట్లోనూ మాస్కు ధ‌రించాలి. జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి, త‌ల‌నొప్పి, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే స‌మీపంలోని ప్ర‌భుత్వ కొవిడ్ నిర్దార‌ణ ప‌రీక్ష‌ల కేంద్రంలో ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఇక్క‌డ ప‌రీక్ష‌ల‌‌ను ఉచితంగా చేస్తారు. ఈ విష‌యంలో ఇంకా ఏమైనా సందేహాలుంటే 104 నెంబ‌రుకు కాల్ చేయాలి” అని ప్రకటనలో పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 5 =