తెలంగాణలో 74 కి చేరిన రెవెన్యూ డివిజన్ల సంఖ్య, కొత్తగా వేములవాడ డివిజన్ ఏర్పాటు

Telangana Govt Makes Vemulawada As Revenue Division, Vemulawada As Revenue Division with 6 Mandals, Vemulawada As Revenue Division,Telangana Govt,Telangana , List of revenue divisions in Telangana ,vemulawada revenue division

తెలంగాణ రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆరు మండలాలతో కొత్తగా వేములవాడ రెవెన్యూ డివిజన్‌ ను ఏర్పాటు చేశారు. వేములవాడ, వేములవాడ రూరల్‌, చందుర్తి, బోయిన్‌పల్లి, కోనారావుపేట, రుద్రంగి మండలాలను కలిపి వేములవాడ రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే ఆందోల్-జోగిపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మెదక్‌ జిల్లాలోని జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ లను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ను గత ఫిబ్రవరిలోనే ప్రభుత్వం‌ జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 73 రెవెన్యూ డివిజన్లు ఉండగా వేములవాడ కూడా చేరడంతో మొత్తం సంఖ్య 74కి చేరుకుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =