తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తే.. దేశం కూడా అదే ఫాలో అవుతోంది – మంత్రి కేటీఆర్

Minister KTR Virtually Launches Flipkarts New Fulfillment Center at Sangareddy Today,KTR Virtually Launches Flipkarts New Fulfillment Center,Flipkarts New Fulfillment Center,Mango News,Mango News Telugu,Flipkarts New Fulfillment Center At Sangareddy,Flipkart Office in Sangareddy Telangana Branch,KTR Launches Flipkarts New Fulfillment Center,Fulfillment Center at Sangareddy,KTR Participating in Launch Ceremony of Flipkarts,Minister KTR Latest News and Updates,Flipkarts New Fulfillment Center Latest News,Minister KTRs Speech

తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తే.. దేశం కూడా అదే ఫాలో అవుతోందని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీ రామారావు. మంగ‌ళ‌వారం ఆయన వ‌ర్చువ‌ల్ విధానంలో సంగారెడ్డిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లిప్‌కార్ట్ ఫుల్ ఫిల్‌మెంట్ సెంట‌ర్‌ను ప్రారంభించారు. బేగంపేట‌లోని ఐటీసీ కాక‌తీయలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఐటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్, ఫ్లిప్‌కార్ట్ సీఈవో క‌ల్యాణ్‌తో పాటు ప‌లువురు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఆవల పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా గత కొన్నేళ్ళనుంచి చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగా నేడు సంగారెడ్డిలో ఫ్లిప్ కార్ట్ ఫుల్ ఫీల్‌మెంట్ సెంట‌ర్ ఏర్పాటు చేసినందుకు సంస్థ యాజ‌మాన్యానికి కృత‌జ్ఞ‌త‌లని పేర్కొన్నారు.

ఇక ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా దాదాపు 40 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఈ కామ‌ర్స్ రంగం వేగంగా దూసుకుపోతోంద‌ని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం అద్భుత సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క బృందాలు విజ‌య‌వంతంగా ప‌ని చేస్తున్నాయని, అందుకే ఉపాధి క‌ల్ప‌న‌లో మ‌హిళ‌ల‌కు 50 శాతం ప్రాధాన్యం ఇవ్వాలని నూతనంగా ఏర్పడుతున్న పరిశ్రమలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుందని, అందుకే రాష్ట్రం ఏం చేస్తే.. దేశం కూడా అదే ఫాలో అవుతోందని, దేశానికి తెలంగాణ‌ను రోల్ మోడ‌ల్‌గా మారుద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fourteen =