గెలుపు కోసం కోట్లు ఖర్చు పెడుతున్న అభ్యర్థులు

Those are the expensive constituencies,expensive constituencies,Those are the constituencies,Mango News,Mango News Telugu,expensive constituencies,Candidates, spending crores to win,Seriligampally, Rajender Nagar, Maheswaram, LB Nagar, Tandur, Kodangal,Assembly Elections 2023,elangana Assembly elections,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates
expensive constituencies,Candidates, spending crores to win,Seriligampally, Rajender Nagar, Maheswaram, LB Nagar, Tandur, Kodangal,Assembly Elections 2023

ఎన్నికలు అంటేనే డబ్బుల ప్రవాహం. రాజకీయాల్లో గెలుపోటములను డిసైడ్ చేసేది డబ్బే . బ్యాలెట్ బాక్స్ నుంచి ప్రజా సేవకుడు ప్రజాప్రతినిధిగా వస్తాడని అప్పుడు అంబేద్కర్ చెప్పిన మాటలు కాస్తా.. ఇప్పుడు డబ్బు సంచుల నుంచి ప్రజాప్రతినిధి వస్తాడు’ అనేది ప్రచారంగా మారిపోయింది.

గతంలో హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారనేదానిపై ఒక రేంజ్‌లో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కూడా కొన్ని నియోజకవర్గాలు కోట్లలో ఖర్చు చేస్తూ చాలా ఖరీదైన సెగ్మెంట్స్‌గా  మారాయి.ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల కొన్నినియోజకవర్గాలలో కోట్ల రూపాయల ప్రవాహం పారుతోంది.

ఈ సారి ఎన్నికల్లో ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చుపెడతారో వారినో బరిలోకి  దింపాయి అన్ని పార్టీలు. దీంతో  వ్యవస్థను చక్కదిద్దుతానంటూ  సామాన్యుడు ఎవరైనా సరే ముందుకు రావడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఎన్నికల ఖర్చును చూసిన సామాన్యుడు ప్రజాప్రతినిధి కావాలన్న ఆశలను అక్కడే చంపేసుకుంటున్న సిచ్యువేషన్ దర్శనమిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల్లో వ్యాపారవేత్తల రంగప్రవేశంతో ఓటు కూడా అంగట్లో సరుకుగా మారిపోయింది.

అన్ని రాజకీయ పార్టీలు రూ.కోట్లు ఖర్చు చేయగల క్యాండిడేట్లను ఎన్నికల బరిలో దింపడంతో ఈసారి ఎలక్షన్స్ చాలా ఖరీదైనవిగా మారిపోయాయి. ఒక్కో నియోజకవర్గంలో సుమారు రూ.100 కోట్లుకు పైనే ఒక్కో అభ్యర్ధి ఖర్చు చేయడానికి  సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతమైన శేరిలిగంపల్లి, రాజేందర్ నగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు కోట్లల్లో ఉండబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అంటూ.. గెలుపే లక్ష్యంగా  ఎన్నికల ప్రచారాన్ని ఆర్భాటంగా కొనసాగిస్తున్నారు. ప్రచార కూలి నుంచి అగ్రనాయకత్వం వరకు ఎవరినీ వదలకుండా అందరినీ డబ్బులతో కొనేస్తున్నారు. కుల సంఘాలే కాదు.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతోనూ బేరసారాలు చేసేస్తున్నారు. అంతేకాదు వార్డు మెంబర్ల నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు ఒక్కో  రేటు కట్టి తమవైపు తిప్పుకుంటున్నారు.  మరోవైపు ఎన్నికల ప్రచారానికి టెక్నాలజీని కూడా సాయం తీసుకుంటున్నారు.   మొబైల్స్ ద్వారా క్యాంపెయిన్,  ఇంటింటికీ పాంప్లెట్స్ పంపిణీ చేయడం ఇలా ప్రతీ పనికి ఓ రేటు.. ఆ రేటు ప్రకారం  డబ్బులు పే చేయాల్సిందే. ఒక పార్టీ అభ్యర్థి ప్రచార కూలికి రూ.500 ఇస్తుంటే.. మరో పార్టీ అభ్యర్థి రూ. రూ.వెయ్యి ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదు.

ఇలా ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం.. ఎక్కడా తగ్గకుండా  అభ్యర్థులు పోటీ పడి మరీ డబ్బులు కుమ్మరిస్తున్నారు. ఇలా ఒక్క శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే దాదాపు రూ.500 కోట్లు చేతులు మారనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థి రూ.200 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమైనట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఇంటింటికీ తిరిగి తమ పార్టీ గుర్తును,పార్టీ మేనిఫెస్టోను ప్రచారం చేసే వ్యక్తికి అక్కడ రోజుకు రూ. 1500 నుంచి  రూ. 2000 వరకు ఇస్తున్నారు. రాజేందర్ నగర్ నియోజవర్గంలో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. ఇక్కడ ఎన్నికల బరిలో నిలిచిన వారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులే  కావడంతో ఈసారి ఎన్నికల కూడా బిజినెస్‌లా పోటీ పడుతూ అదే మోడ్‌లో  కొనసాగనున్నాయంటూ స్థానికులు సెటైర్లు వేసుకుంటున్నారు.

మహేశ్వరం నియోజకవర్గం అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతమైనా కూడా  ఎన్నికల ఖర్చు అర్బన్ ప్రాంతాన్ని మించిపోనుందని ఆయా పార్టీల శ్రేణులు చెబుతున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి సబితాఇంద్రారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ అభ్యర్థి శ్రీరాములు ముగ్గురి మధ్య ఇప్పటికే నెలకొన్న తీవ్ర పోటీతో  అక్కడ పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఎవరికి వారే ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవడంతో.. ఎంత డబ్బు ఖర్చు పెట్టయినా గెలుపును సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. దీంతో ఎక్కడిక్కక్కడ లీడర్లను కొనుగోలు చేస్తున్నారు.

వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్రెడ్డి మధ్య  జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే కాసుల వర్షం కురుస్తోంది. కొండగల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌కు ప్రత్యర్ధిగా బరిలో దిగుతున్న టీపీసీసీ రేవంత్ రెడ్డి గెలుపు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం కావడంతో.. అక్కడ కూడా డబ్బు ఏరులై పారుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.  అటు రేవంత్ రెడ్డిని ఓడించడానికి బీఆర్ఎస్ కూడా డబ్బుకు వెనుకడుగు వేయకుండా  ఎంత డబ్బు అయినా సరే ఖర్చు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =