తెలంగాణలో పాఠశాలలు, డైట్ కాలేజీలకు జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు

diet, DIET Colleges, Mango News, Summer holidays for schools extended until 15 June, telangana, Telangana extends summer holidays for schools till June 15, Telangana extends summer vacation for school students, Telangana Govt Extended Summer Holidays for Schools, Telangana govt extends summer time holidays in colleges, Telangana govt extends summer vacations in schools, Telangana Summer holidays for schools extended

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటితో వేసవి సెలవులు పూర్తవుతుండంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగించారు. పాఠశాలలకు మరియు డైట్ కాలేజీల‌కు జూన్ 15 వ‌ర‌కు వేసవి సెల‌వులను పొడిగిస్తునట్టు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు అమలయ్యేందుకు అవసరమైన చర్చలు తీసుకోవాలని హైదరాబాద్, వరంగల్ రీజినల్ జాయింట్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు, జిల్లాల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కు, డైట్ కాలేజీల ప్రిన్సిపాల్స్ కు సూచించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా కరోనా వ్యాప్తి దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులను జూన్ 30 వరకు పొడిగిస్తునట్టు ప్రకటించారు. జూన్ 30 తర్వాత పరిస్థితులను సమీక్షించి పాఠశాల ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here