ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీఐడీ విచారణకు అనుమతిచ్చిన ఏపీ హైకోర్టు

AP High Court Gives Permission To CID Probe on MP Raghurama Krishna Raju, High Court Gives Permission To CID Probe on MP Raghurama Krishna Raju, Andhra Pradesh High Court Gives Permission To CID Probe on MP Raghurama Krishna Raju, CID Probe on MP Raghurama Krishna Raju, MP Raghurama Krishna Raju, High Court Gives Green Signal For CID Trial on MP Raghu Rama Krishna Raju, YSRCP rebel MP Raghuramkrishnan Raju has given a series of shocks to the Andhra Pradesh government, Andhra Pradesh government, YSRCP rebel MP Raghuramkrishnan Raju, MP krishnan Raju, YSRCP rebel MP, Raghuram krishnan Raju, CID Probe, CID Probe On YSRCP rebel MP, Mango News, Mango News Telugu,

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు తనపై సీఐడీ నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరుతూ వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలోని రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా రఘురామ మీడియా ముఖంగా వ్యాఖ్యానించారని అభియోగాలు మోపుతూ ఏపీ సీఐడీ ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం సీఐడీ పెట్టిన కేసు కొట్టేయాలన్న రఘురామ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.

హైదరాబాద్‌లోని దిల్‌కుష్‌ గెస్ట్‌హౌస్‌లో సీఐడీ విచారణ చేపట్టాలని, అలాగే రఘురామ కృష్ణరాజు సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రఘురామపై సీఐడీ పెట్టిన రాజద్రోహం కేసు మినహా ఇతర కేసులలో సీఐడీ విచారించవచ్చని స్పష్టం చేసింది. అయితే విచారణకు కొన్ని షరతులను విధించింది. రఘురామ తరపు న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలనీ, అలాగే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకే ఎంపీని విచారించాలని సీబీఐకి ఆదేశించింది. ఒకవేళ విచారణ సందర్భంగా సీఐడీ పోలీసులు నిబంధనలను పాటించకుంటే కోర్టు ధిక్కరణ కింద క్రమశిక్షణ చర్యలను తీసుకుంటామని తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =