ఆ రెండు పరీక్షలకు అసైన్‌మెంట్లు సమర్పించాలి, తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు ఆదేశాలు

EHV and environmental education exams, Environmental Education Exams, Mango News, Telangana Board of Intermediate Education, Telangana Inter Board, Telangana Inter Board Orders over EHV, Telangana Inter Board Orders over EHV and Environmental Education Exams, Telangana Inter Exams 2021, Telangana State Board of Intermediate Education, TS Inter Exams, TS Inter Exams 2021

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పరీక్షలను “అసైన్‌మెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్” పద్దతిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. అందులో భాగంగా మొదటి సంవత్సరం విద్యార్థులు ఆ రెండు పరీక్షలుకు కేటాయించిన ప్రశ్నలకు అసైన్‌మెంట్ల రూపంలో ఇంట్లోనే సమాధానాలు రాసి, సంబంధిత కాలేజీల ప్రిన్సిపాల్స్ కు పంపించాలని సూచించారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

ఏప్రిల్ 1 వ తేదీ నుంచి ఏప్రిల్ 20 వ తేదీ మధ్య నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా పీడీఎఫ్ ఫార్మాట్ లో మెయిల్ ద్వారా అసైన్‌మెంట్లను విద్యార్థులు ప్రిన్సిపాల్స్ కు సమర్పించాలని చెప్పారు. అయితే ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు ఏప్రిల్‌ 1 నుంచి https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లో హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకుని, అసైన్‌మెంట్ వర్క్ లో హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయాలని సూచించారు. ఇక రెండవ సంవత్సరం విద్యార్థులు (రెగ్యులర్) ఎవరైనా ఈ రెండు పరీక్షల్లో క్వాలిఫై కాకుండా ఉంటే, వారు కూడా వారి మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ వేసి అసైన్‌మెంట్లు సమర్పించాలని చెప్పారు. అలాగే పాత విద్యార్థులు (ప్రైవేట్) వారి గత రెండవ సంవత్సరం హాల్ టికెట్స్ ద్వారా ఈ పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 4 =