కులాలు, మ‌తాలు పేరుతో కొందరు రాజకీయం చేస్తున్నారు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – మంత్రి కేటీఆర్

Telangana IT Minister KTR Slams BJP Party Over It's Politics in The Country, IT Minister KTR Slams BJP Party Over It's Politics in The Country, Minister KTR Slams BJP Party Over It's Politics in The Country, KTR Slams BJP Party Over It's Politics in The Country, BJP Party Politics in The Country, BJP Party Politics, KTR Slams BJP Party, Telangana IT Minister KTR, IT Minister KTR, Telangana IT Minister, Minister KTR, KTR, BJP Party, BJP Party Politics News, BJP Party Politics Latest News, BJP Party Politics Latest Updates, BJP Party Politics Live Updates, Mango News, Mango News Telugu,

కులాలు, మ‌తాలు పేరుతో కొందరు రాజకీయం చేస్తున్నారని, వీరి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు తెలంగాణ ఐటీ మరియు మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్. శనివారం ఖమ్మంలో ల‌కారం చెరువుపై రూ. 11.75 కోట్ల‌తో నిర్మించిన కేబుల్ వంతెన‌ను మంత్రి పువ్వాడ అజ‌య్‌తో క‌లిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగిస్తూ.. ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో జ‌రుగుతున్న అభివృద్ధి తెలంగాణలో మ‌రో కార్పొరేష‌న్‌లో జ‌ర‌గ‌డం లేదని, ఖ‌మ్మం న‌గరాన్ని నెంబ‌ర్‌వ‌న్‌గా మార్చాల‌న్న‌ది మంత్రి అజ‌య్ ల‌క్ష్య‌మ‌ని, దీనికోసం ఆయన అహర్నిశలూ కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు.

ఇటీవల కొందరు బీజేపీ నేతల చేసిన అనుచిత వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ముస్లింలు నిరసనలు తెలిపే పరిస్థితి ఎదురైందని, ఇలా కులాలు, మతాలు పేరుతొ ఓట్లు పొందడానికే వారు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రస్తుతం దేశంలో ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అని, కుల పిచ్చి, మ‌త పిచ్చి కాదని స్పష్టం చేశారు. హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి చలిమంట కాచుకోవడం తప్ప బీజేపీ నాయకులు చేసిందేంటని మంత్రి కేటీఆర్‌ నిలదీశారు. 1987 నాటికి భార‌త‌దేశం, చైనా దేశాల ఆర్థిక ప‌రిస్థితి సమానమని, కానీ ఇప్పుడు వారు మనం అందుకోలేని స్థాయికి చేరుకున్నారని తెలిపారు. వారు పేద‌ ప్రజల సంక్షేమం, అభ్యున్న‌తి, అభివృద్ధిపై దృష్టి సారించి ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్‌గా నిలిచారని, మనం మాత్రం కులాలు-మతాలు అంటూ వెనుకబడిపోయామని పేర్కొన్నారు. ఏ మతం దేవుడైనా పక్కవారితో పంచాయితీ పెట్టుకోమని చెప్పలేదు కదా మంత్రి కేటీఆర్ అని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + eighteen =