ర్యాలీలు, సభలతో బిజీ అయిపోయిన ప్రధాన పార్టీలు

A full stop to the campaign in a few hours,A full stop to the campaign,campaign in a few hours,full stop to the campaign,campaign in a few hours, campaign,Main parties, rallies, meetings, votes,Telangana Assembly Elections 2023,Assembly Seat, BJP,BRS, Congress,Mango News,Mango News Telugu,Main parties News Today,Rallies Latest News,Rallies Latest Updates,Telangana Election Latest Updates,Telangana Politics, Telangana Political News And Updates
campaign in a few hours, campaign,Main parties, rallies, meetings, votes,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి రేపు సాయంత్రం అంటే నవంబర్ 28 సాయంత్రం 5 గంటల వరకే సమయం మిగిలి ఉండటంతో.. అభ్యర్థులు తమ ప్రచారంలో మరింత వేగాన్ని పెంచుతున్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులంతా భారీ ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. స్టార్‌ క్యాంపెయినర్లతో గట్టిగా ప్రచారం చేయించుకుంటూ ఓటర్లను ఆకట్టుకోవడంలో పోటీ పడుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే  చాలాసార్లు జాతీయస్థాయి నేతలు వచ్చి ప్రచారాలకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. బీజేపీ అగ్రనేతలయిన  ప్రధాని మంత్రి మోడీతో పాటు..   అమిత్‌ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఉమ్మడి జిల్లాలో ఏకంగా మూడు సార్లు ప్రచారానికి వచ్చి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచారు.ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా అన్ని నియోజకవర్గాల్లో సభలు పూర్తి చేశారు. దీన్ని బట్టి నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్‌ , బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య త్రిముఖ పోరు ఏ స్థాయి లో ఉందో తెలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటికే జిల్లాలో ప్రచారం తారాస్థాయిలో నడుస్తోండగా.. సమయం దగ్గర పడతుండటంతో దీని వేగాన్ని మరింత పెంచారు నేతలు.అలాగే తమ  ప్రచారంతో పాటు కులసంఘాలతో కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు చాలాసార్టు  ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా ఇంటింటి ప్రచారాన్ని కూడా నిర్వహిస్తూ వచ్చారు.

ఇందూరు గడ్డ మీద నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుతూ తమ ప్రచారంతో మరింత పొలిటికల్ హీట్ పెంచారు. ఇటు జిల్లాలోని నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ఒకరిపై ఒకరు మాటలు తూటాలు  విసురుకుంటూ వచ్చారు. మరికొంతమంది నేతలైతే పరుష పదజాలం కూడా ఉపయోగంచడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వాడివేడిగా తయారైంది.

ప్రచార పర్వానికి సమయం దగ్గర పడనుండటంతో .. చాలామంది అభ్యర్థులు పోల్‌ మేనేజ్‌మెంట్‌ మీద ప్రత్యేంగా దృష్టి సారించారు. సమయం తరిగిపోతుండడంతో అభ్యర్థులు, నాయకులు ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా.. ప్రతి నిమిషాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ప్రతీ ఓటు , ప్రతీ ఓటరు కూడా కీలకం కానుండటంతో అందరినీ తమ వైపు తిప్పుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా చివరి వరకూ చేస్తున్నారు.

మరోవైపు సోషల్‌ మీడియాపైనా కూడా అంతే దృష్టి సారిస్తున్నారు. చిన్న పార్టీల నుంచి పెద్ద పార్టీల వరకూ అంతా  సోషల్ మీడియా  ద్వారా భారీ ప్రచారానికి కూడా తమ ప్రాధాన్యత ఇస్తున్నారు.దీంతో సోషల్‌ మీడియా ప్రచారంలో ఓటర్లు,  సీనియర్‌ సిటిజన్లు తమతమ విశ్లేషణ చేస్తూ ఎవరికి ఓటేయాలనుకుంటున్నామో వివరిస్తున్నారు. దీంతో చాలామంది ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.  అయినా సగటు ఓటరు తన మనసులో మాట బయటపెట్టకపోవడంతో.. సోషల్‌ ఇంజినీరింగ్‌ పకడ్బందీగా చేస్తూ వస్తున్నారు నేతలు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =