నాగార్జునసాగర్, తిరుపతిలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచార గడువు

Election Campaign in Nagarjuna Sagar, Election Campaign in Tirupati, Last Day for Election Campaign in Nagarjuna Sagar, Mango News, Nagarjuna Sagar Assembly By-election, Nagarjuna Sagar Assembly Poll, Nagarjuna Sagar By-election, Nagarjuna Sagar By-election Campaign, Nagarjuna Sagar By-election News, Tirupati, Tirupati By Election, Tirupati By Election Campaign, Tirupati By Election Updates, Today Last Day for Election Campaign in Nagarjuna Sagar and Tirupati

తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ రెండు చోట్ల‌ ఎన్నికల ప్రచార గడువు ఈ రోజు (ఏప్రిల్ 15, గురువారం) సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ముఖ్యంగా రెండు చోట్ల కూడా అధికార పార్టీల అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకుపోయారు. తిరుపతి స్థానంలో అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నాయకులు, అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర పార్టీ నాయకులు ప్రచార సభలు నిర్వహించి తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలని కోరారు.

అలాగే నాగార్జునసాగర్ స్థానంలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు, నాయకులు ప్రజలతో మమేకమై తమ ప్రచారంతో హోరెత్తించారు. ఇక ఈ స్థానాల్లో ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 2 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. ఇరు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారిన ఈ ఉపఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వేచిచూడాలి.

నాగార్జునసాగర్ బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే:

  • టీఆర్ఎస్ – నోముల భగత్ కుమార్
  • కాంగ్రెస్ – జానారెడ్డి
  • బీజేపీ – పానుగోతు రవికుమార్

తిరుపతి బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే:

  • వైఎస్సార్సీపీ – ఎం.గురుమూర్తి
  • టీడీపీ – పనబాక లక్ష్మీ
  • బీజేపీ – రత్నప్రభ
  • కాంగ్రెస్ – చింతా మోహన్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 10 =