తెలంగాణలో తాజా ఓటరు జాబితా వివరాలు ఇవే…

Final electoral rolls in GHMC, Final Electoral Rolls In Telangana, Hyderabad Final electoral rolls, Mango News, Telangana News, Telangana Political News, Telangana SEC, Telangana SEC Announces Final Electoral Rolls, Telangana SEC Announces Final Electoral Rolls in The State, telangana updates

తెలంగాణ రాష్ట్రంలో జనవరి 15, 2021 నాటికి అర్హులైన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,82,497 మంది ఓటు హక్కు పొందినట్టు ప్రకటించారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 43,11,803 ఓటర్లు ఉండగా, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 30,97,677 ఉన్నారు. ఇక ములుగు జిల్లాలో అత్యల్పంగా 2,14,291 మంది ఓటర్లు ఉన్నారు.

తెలంగాణ ఓటర్ల జాబితా వివరాలు:

  • రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య : 119
  • మొత్తం పోలింగ్ స్టేషన్స్ సంఖ్య : 34,708
  • రాష్ట్రంలో మొత్తం ఓటర్లు సంఖ్య : 3,01,65,569
  • పురుష ఓటర్లు సంఖ్య : 1,51,61,714
  • మహిళా ఓటర్లు సంఖ్య : 1,50,02,227
  • థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య : 1,628
  • కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య : 2,82,497
  • సర్వీస్ ఓటర్ల సంఖ్య : 13,703
  • తొలగించిన ఓటర్ల సంఖ్య : 1,72,255
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 12 =