రాబోయే వానాకాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతించాలి: మంత్రి గంగుల

Minister Gangula Kamalakar Meets Union Civil Supplies Secretary at Delhi over Paddy Issues

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ లు బుధవారం నాడు కేంద్రమంత్రి పియూష్ గోయల్ ను కలిసి రాష్ట్ర అంశాలపై విజ్ఞాపన పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన పియూష్ గోయల్ కేంద్ర ఆహార పౌరసరఫరాల కార్యదర్శి సుదాన్షు పాండేకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ధాన్యం సమస్యలపై గురువారం నాడు కేంద్ర కార్యదర్శితో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కమీషనర్ అనిల్ కుమార్ లు ఢిల్లీ కృషి భవన్ లో ప్రత్యేక భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర కార్యదర్శికి మూడు ప్రధాన సమస్యలపై మంత్రి గంగుల కమలాకర్ సమగ్ర వివరాలు అందించారు. ఈ యాసంగిలో పారాబాయిల్డ్ రైస్ 50 లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్.సి.ఐ తీసుకొని రైతులకు మేలు చేయాలని, గతంలో 2019-20 రబీలో నష్టపోయిన ముప్పై రోజుల్ని భర్తీ చేసి మిగిలిన బియ్యాన్ని అందించడానికి మరో ముప్పై రోజుల గడువుని పెంచాలని, రాబోయే వానాకాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతించాలని కోరారు. గతంలో సైతం ఇదే రీతిన కొనుగోళ్ళు జరిగాయని వాటికి సంబంధించిన గణాంకాలను మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర కార్యదర్శికి అందించారు.

ఈ అంశాలపై సమగ్రంగా చర్చించిన అనంతరం తెలంగాణలో మిల్లింగ్ కొనసాగుతున్నందున సత్వర పరిష్కారం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి గంగుల విజ్ఞప్తి మేరకు కేంద్ర కార్యదర్శి మధ్యాహ్నం ఎఫ్.సి.ఐ ఉన్నతాధికారులు, రాష్ట్ర అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. తద్వారా అన్ని సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + twenty =