తెలంగాణ: ప్రయాణికులకు షాక్‌.. టిక్కెట్ రిజర్వేషన్‌ చార్జీలను పెంచిన టీఎస్‌ఆర్టీసీ

Telangana TSRTC Increased Ticket Reservation Charges, TSRTC Once Again Increases Ticket Reservation Charges From Today Due To Fuel Price Hike, TSRTC Once Again Increases Ticket Reservation Charges From Today, TSRTC Once Again Increases Ticket Reservation Charges Due To Fuel Price Hike, Fuel Price Hike, TSRTC Increases Ticket Reservation Charges, TSRTC Ticket Reservation Charges, TSRTC Ticket Reservation Charges Hike, Ticket Reservation Charges Hike, Telangana State Road Transport Corporation, Telangana State Road Transport Corporation Increases Ticket Reservation Charges, Telangana State Road Transport Corporation Increases Ticket Reservation Charges From Today Due To Fuel Price Hike, Ticket Reservation Charges, TSRTC Ticket Reservation Charges Hike News, TSRTC Ticket Reservation Charges Hike Latest News, TSRTC Ticket Reservation Charges Hike Latest Updates, TSRTC Ticket Reservation Charges Hike Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రయాణికులకు మరో షాక్‌ ఇచ్చింది. మార్చి 27 నుంచి ఇది అమల్లోకి వచ్చినప్పటికీ దీనిపై ఇప్పటివరకూ కార్పొరేషన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. నాలుగు రోజుల వారాంతపు సెలవులను ఎంజాయ్ చేసేందుకు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు వెళ్లిన ప్రయాణికులు కంగుతిన్నారు. అడ్వాన్స్ రిజర్వేషన్ ఛార్జీలను చివరిసారిగా 2016లో పెంచారని కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, గత 3 వారాల్లో ఆర్టీసీ ఛార్జీలు పెరగడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ఇంతకుముందు ప్యాసెంజర్ సెస్, బస్ పాస్‌లకు సవరణ, టోల్ సెస్, రౌండప్ రూపంలో ఛార్జీలు పెంచిన టీఎస్‌ఆర్‌టీసీ, ఈసారి రిజర్వేషన్ ఛార్జీలను కూడా పెంచేసింది. రిజర్వేషన్ ఛార్జీలను రూ.20 నుంచి రూ.30 వరకు ఒక్కో టికెట్ పైన పెంచినట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్‌, ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు ఎం. నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పుల్లో ఉన్న సంస్థ అందులో నుంచి బయటపడటానికి టికెట్ల రేట్లు పెంచడం మినహా మరో మార్గం లేదు. అయితే ముందస్తుగా టిక్కెట్లు బుక్‌ చేసుకుని చివరి నిమిషంలో రద్దు చేసుకోవాలనుకునే ప్రయాణికులపై ఇది అనవసర భారం తప్ప మరొకటి కాదు. ముందస్తుగా ట్రిప్‌ ప్లాన్‌ చేసుకునే వారికి ఇంత భారం పడడం బాధాకరం, ఈ రిజర్వేషన్ ఛార్జీలను కార్పొరేషన్ తొలగిస్తుందని ఆశిస్తున్నాము అని ఆయన తెలిపారు. ఈ పెరిగిన రిజర్వేషన్‌ చార్జీలు మార్చి 27 నుంచే అమలు అవుతున్నట్టు తెలుస్తోంది. కాగా గుట్టుచప్పుడు కాకుండా చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 14 =