కొత్తగూడ ఫ్లైఓవర్‌ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurates Kothaguda Flyover in Hyderabad City,KTR Inaugurates Kothaguda Flyover,Kothaguda Flyover,Kothaguda Flyover Hyderabad,Mango news,Mango News Telugu,Kothaguda Underpass,Kothaguda Kondapur Flyover Plan,Kothaguda Kondapur Flyover Design,Kothaguda Junction,Kothaguda Flyover Status,Kothaguda Flyover Plan,Kothaguda Flyover Opening Date,Kothaguda Flyover Map,Kothaguda Flyover Design,Kothaguda Flyover Completion Date,Kondapur Flyover Kothaguda Flyover Design,Kondapur Flyover Completion Date

హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నగరంలో కొత్తగూడ ఫ్లైఓవర్‌ ను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) లో భాగంగా 263 కోట్ల వ్యయంతో హైదరాబాద్ లోని బొటానికల్ గార్డెన్, కొత్తగూడ మరియు కొండాపూర్ జంక్షన్ ల వద్ద నిర్మించిన 2వ అతిపెద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్ ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు హైటెక్ సిటీని పొరుగున ఉన్న మియాపూర్ మరియు ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. తాజాగా ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఆ మార్గంలో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కొత్తగూడ ఫ్లైఓవర్ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద పూర్తి చేసిన 34వ ప్రాజెక్ట్ అని, మరో 11 ప్రాజెక్టులు 2023లో పూర్తవుతాయని తెలిపారు. అలాగే స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఎన్‌డీపీ)ని ఏప్రిల్ నాటికి పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మేయర్ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 3 =