ల్యాండ్ క్రూయిజర్ కార్ల వ్యవహారంపై కవిత స్పందన ఇదే…

This Is kavithas Response To The Land Cruiser Car Issue, kavithas Response To The Land Cruiser Issue, Land Cruiser Car Issue Kavitha Response, kavithas Response, CM Revanth Reddy, MLC Kavitha, Land Cruiser Cars Issue, Kadiyam Srihari, Latest kavithas Response On Revanth Reddy Comments, Revanth Reddy Comments, Revanth Reddy Vs Kavitha, Land Cruiser, TS CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News
CM Revanth reddy, MLC Kavitha, Land Cruiser cars issue, Kadiyam Srihari

తెలంగాణలో ల్యాండ్ క్రూయిజర్ కార్ల కొనుగోలు వ్యవహారం కాక రేపుతోంది. బీఆర్ఎస్ సర్కార్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను కుదిపేస్తున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కన్నారని.. అందుకోసమే ప్రత్యేకంగా కాన్వాయ్ రెడీ చేయించుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రజా ధనంతో 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొని.. విజయవాడలో దాచి పెట్టారని వ్యాఖ్యానించారు.

అయితే నిన్నటి వరకు కూడా ఈ వ్యవహారంపై అటు కేసీఆర్ కానీ, కేటీఆర్, హరీష్ రావులు కానీ స్పందించలేదు. తాజాగా బీర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ వ్యవహారంపై అతి చేస్తే రేవంత్ రెడ్డి గౌరవానికే నష్టం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ఉన్న వారి సెక్యూరిటీని అధికారులు చూస్తారన్న కవిత.. అందులో భాగంగానే ల్యాండ్ క్రూయిజర్ కార్లు విజయవాడలో ఉంచి ఉంటారని వ్యాఖ్యానించారు. దీనిపై రాద్దాంతం చేయడం వల్ల రేవంత్ రెడ్డి గౌరవమే తగ్గుతుందని.. ఆయనకే నష్టమని.. తమకెటువంటి నష్టం లేదని కవిత చెప్పుకొచ్చారు.

అలాగే అమలు కాని హామీలతో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిందని కవిత ఎద్దేవా చేశారు. అయినప్పటికీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ సర్కార్ బాధ్యతతో పని చేయాలని అన్నారు. బీఆర్ఎస్ స్పీడ్‌కు ఇది బ్రేక్ మాత్రమేనన్న కవిత.. పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి పుంజుకుంటామని.. తమ సత్తా చూపెడుతామని చెప్పుకొచ్చారు.  ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకొని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

ఇక అంతకంటే ముందు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ల్యాండ్ క్రూయిజర్ కార్ల వ్యవహారంపై స్పందించారు. ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొనుగోలు చేసిన వాస్తవమేనన్న కడియం శ్రీహరి.. ఆ కార్లు కేసీఆర్ సొంతానికి కొన్నవి కాదని చెప్పుకొచ్చారు. తెలంగాణ కేబినెట్ ఆమోదంతోనే 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొనుగోలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఆ వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ చేయించడం కోసమే విజయవాడకు పంపించారని క్లారిటీ ఇచ్చారు. కార్లను బుల్లెట్ ప్రూఫ్ చేయించడం కోసం విజయవాడకు పంపించే ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉందని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై అనవసర వ్యాఖ్యలు.. పిచ్చి మాటలు మానుకోవాలని కాంగ్రెస్ నేతలకు కడియం శ్రీహరి సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 7 =