ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తాం : సీఎం కేసీఆర్

CM KCR Thanked Nagarjuna Sagar Constituency People on Grand Victory,Mango News,Mango News Telugu,CM KCR,CM KCR Latest News,CM KCR News,CM KCR Live,CM KCR Pressmeet,CM KCR Pressmeet Live,CM KCR Latest Updates,CM KCR News Latest,KCR,CM KCR Thanked Nagarjuna Sagar Constituency People,Nagarjuna Sagar Byelection Result Latest Update,Sagar Byelection Results Latest Update,Sagar Byelection Results Live,Sagar Byelection Results,Nagarjuna Sagar,Sagar Election Results Latest Update,Sagar Election Results Live,Sagar Election Results Latest News,Sagar Election Results,CM KCR Thanks People Of Nagarjuna Sagar Constituency,Telangana CM Thanks People Of Nagarjuna Sagar For Bypoll Win,Telangana CM

టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్జతలు, ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సీఎం తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం స్పష్టం చేశారు.

దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల మంజూరు చేసిన లిఫ్టు ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తిచేసి ప్రజలకు నీరందిస్తామని సీఎం తెలిపారు. ఎన్నికల సందర్భంలో పార్టీ నాయకులు సేకరించిన ప్రజా సమస్యన్నింటిని కూడా సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరు ఎన్నిరకాల దుష్ప్రచారం చేసినా, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ విశ్వాసాన్ని ప్రస్పుటంగా ప్రకటించిన ప్రజలకు సీఎం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

రెట్టించిన ఉత్సాహంతో మున్ముందు ప్రజాసేవకు టిఆర్ఎస్ పార్టీ మరింతగా పునరంకితమౌతుందని సీఎం మారోమారు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విజయం సాధించిన అభ్యర్ధి నోముల భగత్ కు సీఎం కేసీఆర్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. చక్కగా ప్రజాసేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని నోముల భగత్ కు సీఎం సూచించారు. నోముల భగత్ విజయం కోసం కృషి చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =