టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ అహ్మద్ ఫరీదుద్దీన్ తుదిశ్వాస

breaking news, Chief Secretary to extend state honours to funeral of Ex-Minister, CM KCR Gives Orders to Conduct Funeral with Officials Formalities, Fareeduddin dies of cardiac arrest, Fareeduddin Passed Away, Former Minister Fareeduddin dies of cardiac arrest, Mango News, Telangana CM directs Chief Secretary to extend state honours to funeral of Ex-Minister, TRS EX MLC Mohammed Fareeduddin Passed Away, TRS EX MLC Mohammed Fareeduddin Passed Away CM KCR Gives Orders to Conduct Funeral with Officials Formalities, Trs leader Fareeduddin, Trs leader Fareeduddin Passed Away
Telangana CM directs Chief Secretary to extend state honours to funeral of Ex-Minister

మాజీ మంత్రి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ అహ్మద్ ఫరీదుద్దీన్ గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అయితే, వారం క్రితం ఆయనకు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ లో కాలేయ శస్త్రచికిత్స జరిగింది. అప్పటినించీ హాస్పిటల్ లోనే చికిత్స తీసుకుంటున్న ఫరీదుద్దీన్ కు బుధవారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. వైద్యులు ఎంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.

ఫరీదుద్దీన్ 1957 అక్టోబర్ లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో జన్మించారు. ఆయనకు భార్య ఫాతిమున్నీసా బేగం, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. 2004 లో కాంగ్రెస్ తరపున గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర మైనారిటీ శాఖా మంత్రిగా పనిచేశారు. 2014 లో తెరాసలో చేరారు. 2016లో ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. ఫరీదుద్దీన్ అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం హోతిలో సొంత వ్యవసాయ క్షేత్రంలో జరుపుతామని కుటుంబసభ్యులు తెలిపారు. ఫరీదుద్దీన్ మృతిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం తెలిపారు. ఫరీదుద్దీన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫరీదుద్దీన్ సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − six =