కరీంనగర్‌ మేయర్‌గా సునీల్‌ రావు ఎన్నిక

TRS Leader Sunil Rao Elected As Karimnagar Mayor,Mango News, Political Updates 2020, Telangana Breaking News,Telangana Political Updates,Karimnagar Mayor,TRS Leader Sunil Rao,TRS Karimnagar Mayor post,Karimnagar Mayor Candidate
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ కార్పోరేషన్ స్థానాన్ని టిఆర్ఎస్ పార్టీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కార్పోరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, టిఆర్‌ఎస్‌ పార్టీ 33 డివిజన్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ కార్పోరేషన్ మేయర్‌ అభ్యర్థిగా సునీల్‌రావు పేరును టిఆర్ఎస్ అధిష్ఠానం ఖరారు చేసింది. మేయర్ పదవి జనరల్‌ కేటగిరీకి రిజర్వు కావడంతో ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు పలువురు కార్పోరేటర్లు ప్రయత్నించగా టిఆర్ఎస్ అధిష్టానం సునీల్‌ రావు వైపే మొగ్గు చూపింది. ఇక్కడ గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు సైతం టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో టిఆర్ఎస్ బలం 40కి పైగా పెరిగింది. ఈ రోజు జరిగిన తొలి నగర పాలక మండలి సమావేశంలో ఉదయం 11 గంటలకు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మేయర్ గా సునీల్‌ రావును, డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపరాణిని ఎన్నుకున్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 8 =