చంద్రబాబుతో పవన్ సమావేశం.. ఆ అంశాలపైనే కీలక చర్చ

Pawans meeting with Chandrababu The key discussion is on those issues,Pawans meeting with Chandrababu,The key discussion is on those issues,Chandrababu naidu, pawan kalyan, TDP-Janasena Alliance, AP Politics,Mango News,Mango News Telugu,Janasena chief Pawan Kalyan, AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Janasena chief Pawan Kalyan Latest News,Janasena chief Pawan Kalyan Latest Updates,Chandrababu News Today,Chandrababu Latest Updates
Chandrababu naidu, pawan kalyan, TDP-Janasena Alliance, AP Politics

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసిందో లేదో.. పొరుగు రాష్ట్రమైన ఏపీలో హడావుడి మొదలయింది. ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే నేతలు రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని పావులు కదుపుతోంది. వైసీపీ సర్కార్‌ను గద్దె దించేందుకు వ్యూహాలు రచిస్తోంది.

ఇప్పటికే తెలుగు దేశం పార్టీ జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. చంద్రబాబు నాయుడును పరామర్శించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడే పొత్తుపై క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. అయితే అంతకంటే ముందు జనసేన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగింది. 8 స్థానాల్లో పోటీ చేసింది. ఆ 8 స్థానాల్లో కూడా జనసేన అత్యంత ఘోరంగా ఓటమి పాలయింది. కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు.

ఈక్రమంలో ఏపీలో టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటు అంశం చర్చనీయాంశంగా మారింది. జనసేనకు కేటాయించే సీట్ల విషయంలో చంద్రబాబు నాయుడు భీష్మించుకొని కూర్చుంటారా?.. జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు..? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాదెళ్ల మనోహర్, నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు అంశంపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కట్టబెడుతుందనే దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

అలాగే ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు ప్రారంభించి టీడీపీ, జనసేన పార్టీలు.. ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశాయి. అటు మేనిఫెస్టోకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆరు అంశాలను ప్రతిపాదించగా.. జనసేన ఐదు అంశాలను ప్రతిపాదించింది. ఆ 11 అంశాలను కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించారు. అయితే పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనపై నేటి సమావేశంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − thirteen =