బతుకమ్మ పాట-2022 ను విడుదల చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

TRS MLC Kalvakuntla Kavitha Releases a Series of Bathukamma Songs Today,Kalvakuntla Kavitha Released Bathukamma Song-2022, Bathukamma Song Released By MLC Kavitha, Bathukamma Song 2022, MLC Kalvakuntla Kavitha, Mango News, Mango News Telugu, MLC Kavitha Released Bathukamma Song, Kalvakuntla Kavitha Released Bathukamma Song, MLC Kavitha Bathukamma Song Released, MLC Kavitha Bathukamma Song, MLC Kavitha Latest News And Updates, MLC Kalvakuntla Kavitha, Bathukamma Song-2022

తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 25వ తేదీ నుంచి బతుకమ్మ పండగ ఉత్సవాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25 తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు 9 రోజుల పాటుగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. కాగా బతుకమ్మ పండుగ ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం బతుకమ్మ పాటను విడుదల చేశారు.

హైదరాబాద్‌ లోని తన నివాసంలో ‘సిరిమల్లెలో రామ రఘుమెల్లెలో’ అనే బతుకమ్మ పాట-2022 ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించి, ఈ బతుకమ్మ పాటను రూపొందించిన ఎర్ర శేఖర్ బృందాన్ని అభినందించారు. అనంతరం ఆమె ట్వీట్ చేస్తూ, “పండుగ సీజన్ వచ్చేసింది, ఈరోజు బతుకమ్మ పాటల సిరీస్ ను విడుదల చేయడం చాలా థ్రిల్‌గా ఉంది” అని అన్నారు. ఈ బతుకమ్మ పాట-2022 విడుదల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ దీపికారెడ్డి , ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్, పాట రూపకల్పన బృందం, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here