సిరిసిల్లలో ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమం.. విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్‌

Minister KTR Distributes Tablets To Govt College Students in Sircilla Today,Gift A Smile Program In Sirisilla, Minister Ktr Distributed Tabs To Students, Gift A Smile Program, Minister Ktr To Distribute Byju's Powered Tablets, Byju's Powered Tablets, Minister Ktr, Gift A Smile Initiative, Minister Ktr Gift A Smile Initiative, Minister Ktr, Minister Ktr Byju's Powered Tablets, Byju's Powered Tablets, Mango News, Mango News Telugu, Ktr To Distribute Byju’s Android Tablets, Byju’S Android Tablets, Minister Ktr Latest News And Updates

విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని, పంచేకొద్దీ పెరిగేది విజ్ఞానమేనని అన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా గురువారం సిరిసిల్లలో ఆయన ప్రభుత్వ విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగా ‘మన ఊరు-మన బడి’ అనే పథకం పెట్టి మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో కూడా మరమ్మతులు చేశామని వెల్లడించారు.

ఇక గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద పేద విద్యార్థులకు ట్యాబ్‌లెట్స్‌ అందిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా దాదాపు ఆరు వేల మంది ఇంటర్‌ విద్యార్థులకు ట్యాబ్‌లెట్స్‌ పంపిణీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 120 అంబులెన్సులు సమకూరాయని, వాటిలో ఆరు అంబులెన్సులు సిరిసిల్లకు ఇచ్చామని గుర్తుచేశారు. అలాగే దివ్యాంగుల కోసం 1200 ట్రై మోటార్‌ సైకిళ్లు పంపిణీ చేశామని కూడా మంత్రి వెల్లడించారు. సిరిసిల్లలో ఇంజినీరింగ్‌ కాలేజీతో పాటు మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశామని, దీనికి కారణం సీఎం కేసీఆర్‌ అని తెలిపారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ఇంకా విదేశాల్లో చదవాలనుకునే వారికోసం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కింద రూ.20 లక్షలు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + twenty =