బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత లేఖ

TRS MLC Kavitha Writes a Letter to CJI Justice NV Ramana Regarding Release of 11 Convicts in Bilkis Bano Case of 2002, TRS MLC Kavitha Writes a Letter to CJI Justice NV Ramana, Release of 11 Convicts in Bilkis Bano Case of 2002, 2002 Bilkis Bano Case, Bilkis Bano Case, CJI Justice NV Ramana, TRS MLC Kavitha, MLC Kavitha, 2002 Bilkis Bano Case News, 2002 Bilkis Bano Case Latest News And Updates, 2002 Bilkis Bano Case Live Updates, Mango News, Mango News Telugu,

బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు ఉపశమనం కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత శుక్రవారం లేఖ రాశారు.

“2002 బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల విడుదలకు సంబంధించి గౌరవనీయులైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ)కు నా లేఖ. ఈ దారుణమైన నేరం జరిగినప్పుడు బిల్కిస్ వయస్సు 21 సంవత్సరాలు మరియు 5 నెలల గర్భిణి. మన చట్టాలపై దేశానికి ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని వేడుకుంటున్నాను” అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తూ, లేఖను జతచేశారు. అలాగే మానవత్వంతో ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ద్వారా బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =