ఎంసెట్‌ పరీక్షా కేంద్రం మార్చుకునేందుకు నేడే చివరి తేదీ

AP EAMCET 2020, EAMCET, eamcet 2020, Eamcet Exams Date 2020, Telangana Eamcet Exam, Telangana Eamcet Exam centre, Telangana Eamcet Exam Updates, TS Eamcet 2020, TS Eamcet 2020 Examination Centre Update

తెలంగాణ ఎంసెట్‌ పరీక్షకు సంబంధించి పరీక్ష కేంద్రం మార్చుకునేందుకు విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. పరీక్షా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ కు మార్చుకునేందుకు జూన్ 23, మంగళవారం వారం వరకు అవకాశమిస్తున్నట్టు ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. ఈ తేదీ తర్వాత పరీక్షా కేంద్రం మార్పులకు ఎలాంటి అభ్యర్ధనలు స్వీకరించబడవని ప్రకటనలో పేర్కొన్నారు. eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ లో పరీక్ష కేంద్రం మార్పు చేసుకోవచ్చని తెలిపారు.

అలాగే రెండో విడతలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణకు పరీక్షా కేంద్రాన్ని మార్చుకునేందుకు అవకాశమిస్తున్నట్లు తెలిపారు. ఈసారి తెలంగాణ ఎంసెట్ పరీక్షను జెఎన్‌టియూ -హైదరాబాద్‌ నిర్వహిస్తుండగా, పరీక్షలు జూలై 6 నుండి జూలై 9 వరకు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణ ఎంసెట్ హాల్ టిక్కెట్లు జూన్ 27 నుండి జూలై 3 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =