టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఒడిశా-తెలంగాణ మధ్య సర్వీసుల ఏర్పాటు, ఓఎస్ఆర్టీసీతో కుదిరిన ఒప్పందం

TSRTC Signs MoU with OSRTC To Run Services in Busy Routes Between Telangana and Odisha, TSRTC Signs MoU with OSRTC, Busy Routes Between Telangana and Odisha, Run Services Between Telangana and Odisha, Mango News, Mango News Telugu, Telangana And Odisha Map,Benefits Of Mou,Capital Of Odisha,Does Telangana Share Border With Odisha,Mou Agreement,Mou Meaning In Business,Odisha And Telangana Map,Odisha Neighbour State Name,Odisha Telangana Border Map,Odisha To Telangana Distance,Telangana And Odisha Border,Telangana Map,Telangana Surrounding States,Types Of Mou

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా, ఒడిశా రాష్ట్రానికి 10 బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌, ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓఎస్ఆర్టీసీ) ఎండీ దీప్తేశ్‌ కుమార్‌ పట్నాయక్‌ సమక్షంలో ఒప్పందం కుదిరింది. బుధవారం హైదరాబాద్ బస్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఓఎస్ఆర్టీసీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. పరస్పర బస్‌ సర్వీసుల ఏర్పాటులో భాగంగా రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ఈ బస్సులను నడపడానికి సిద్ధమైంది. ఈ ఒప్పందం ప్రకారం.. టీఎస్‌ఆర్టీసీ 10 బస్సులను ఒడిశా రాష్ట్రానికి నడుపనుండగా.. అదే విధంగా ఓఎస్‌ఆర్టీసీ కూడా 13 బస్సు సర్వీసులను తెలంగాణకు నడపనుంది.

తెలంగాణ ఆర్టీసీ సర్వీసులు ఈ విధంగా..

  • హైదరాబాద్‌-జైపూర్‌ మధ్య సర్వీసులు 2.
  • ఖమ్మం-రాయఘఢ మధ్య సర్వీసులు 2.
  • భవానిపట్న-విజయవాడ (వయా భద్రాచలం) మధ్య సర్వీసులు 2.
  • భద్రాచలం-జైపూర్‌ మధ్య సర్వీసులు మధ్య సర్వీసులు 4.

ఒడిశా ఆర్టీసీ సర్వీసులు ఈ విధంగా..

  • నవరంగ్‌పూర్‌-హైదరాబాద్‌ మధ్య సర్వీసులు 4.
  • జైపూర్‌-హైదరాబాద్‌ మధ్య సర్వీసులు 2.
  • భవానిపట్న-విజయవాడ (వయా భద్రాచలం) మధ్య సర్వీసులు 2.
  • రాయఘఢ-కరీంనగర్‌ మధ్య సర్వీసులు 2.
  • జైపూర్‌-భద్రాచలం మధ్య సర్వీసులు 3.

కాగా ఇటీవలే టీఎస్‌ఆర్టీసీ సుదూర ప్రయాణాల కోసం ఏసీ స్లీపర్ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. సుమారు 12 మీటర్ల పొడవున్న ఏసీ స్లీపర్ బస్సులో 30 మంది ప్రయాణికులు, కింది స్థాయిలో 15 మంది, పై స్థాయిలో మరో 15 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంది. ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి, టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు నేరుగా అనుసంధానించబడిన వాహన ట్రాకింగ్ సిస్టమ్ మరియు పానిక్ బటన్ ఫంక్షన్‌లు అందించబడతాయి. బస్సులో పార్కింగ్ ఆప్టిక్స్ కెమెరా, అగ్ని ప్రమాదాలను గుర్తించేందుకు అగ్నిమాపక సప్రెషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయబడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 12 =