నగరాలు, పట్టణాల్లో గ్రీనరీ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత – సీఎస్ శాంతి కుమారి

Telangana CS Santhi Kumari Held Review on Municipal Urban Development Dept with Officials,Telangana CS Santhi Kumari,Held Review on Municipal,Urban Development Dept with Officials,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అర్బన్ పార్కుల ఏర్పాటు, గ్రీనరీ గణనీయంగా పెరిగిందని, ఇదే మాదిరిగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలలోనూ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి అన్నారు. బుధవారం బీఆర్కెఆర్ భవన్ లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష సమావేశం జరిగింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ కమీషనర్ డా.సత్యనారాయణ, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, జలమండలి, హైదరాబాద్ మెట్రో రైల్, రేరా తదితర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ విభాగాల ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులు సీఎస్ శాంతి కుమారికి వివరించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ, దేశంలోనే అత్యధిక నగర జనాభా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉందని, రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలలో తాగునీటి సరఫరా, హరిత హారం, అంతర్గత రహదారుల నిర్మాణం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, కనీస మౌలిక సదుపాయాల కల్పన తదితర ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో 14 అర్బన్ పార్కులు ఏర్పాటు చేయడం, హరిత హారం కింద పెద్ద ఎత్తున గ్రీనరీని అభివృద్ధి చేయడం పట్ల అభినందించారు. రాష్ట్రంలో హరితహారం కింద భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుందని, పట్టణ ప్రాంతాల్లో దీనిని మరింత అధికంగా చేపట్టేందుకు తగు ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఈ డిసెంబర్ మాసాంతంలోగా మల వ్యర్థాల శుద్దీకరణ ప్లాంటులు (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్) ఏర్పాటు పూర్తవుతాయని, దీంతో అన్ని మున్సిపాలిటీల్లో ఎఫ్.ఎస్.టి.పిలు కలిగిన రెండో రాష్ట్రంగా నిలవడం పట్ల అభినందనలు తెలిపారు. అంతర్గత నిధుల సేకరణ ద్వారా మున్సిపాలిటీలో స్వయం ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉండాలని సూచించారు. గతంలో వచ్చిన భారీ వర్షాల నేపథ్యంలో మే మాసాంతంలోగా హైదరాబాద్ లో చేపట్టిన నాలా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖకు సంబందించిన పెండింగ్ అంశాలపై సవివరమైన నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − two =