అగ్ర వర్ణాల్లోని పేద మహిళలను ఆదుకునేందుకే ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకం తీసుకొచ్చాం – సీఎం జగన్

CM Jagan Distributed Rs658.60 Cr To 439068 Women Beneficiaries Under YSR EBC Nestham Scheme Today,CM Jagan Distributed Rs658.60 Cr,CM Jagan 439068 Women Beneficiaries,Women Beneficiaries Under YSR EBC Nestham Scheme,YSR EBC Nestham Scheme Today,Mango News,Mango News Telugu,CM YS Jagan Mohan Reddy,AP govt. to disburse YSR EBC Nestham,Andhra CM Releases Rs 589cr Under EBC Nestham,YSR EBC Nestham Scheme 2023,YSR EBC Nestham Scheme Latest News,YSR EBC Nestham Live News,CM Jagan Latest News and Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం మార్కాపురంలో పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకం కింద రెండో విడత నిధులు విడుదల చేశారు. ఈ క్రమంలో 4,39,068 మంది మహిళా లబ్ధిదారులకు మొత్తం 658.60 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం లాంటి పథకం లేదని, ఇక పేదరికానికి కులం, మతం ఉండదని, అందుకే ఓసీ వర్గాల్లోని మహిళలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని, అందుకే వారికోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

ఈబీసీ నేస్తం, కాపు నేస్తం వంటి పథకాలు ఎన్నికల ముందు చెప్పినవి కాదని, ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకొచ్చినవని సీఎం జగన్ గుర్తుచేశారు. ఇక పథకం ప్రారంభించిన ఈ రెండేళ్లలో రూ.1,258 కోట్లు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద అందించామని, ప్రజలనుంచి ఇదేమాదిరి సహకారం లభిస్తే మున్ముందు మరిన్ని సంక్షేమ పథకాలు అందించగలమని ఆయన స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలైన బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, వైశ్య, వెలమ మరియు రెడ్డి వంటి కులాల మహిళలకు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ నేస్తం అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రూ. 45-60 సంవత్సరాల వయస్సు గల మహిళా లబ్ధిదారులకు సంవత్సరానికి రూ.15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ. 45,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,92,674 మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొండుతుండగా.. దీనికోసం తాజాగా ప్రభుత్వం దాదాపు రూ.660 కోట్లు కేటాయించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − seven =