రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలు, ఆలోచన ప్రభావం జనసేన పార్టీ సిద్ధాంతాలపై, పోరాట పంథాపై ఉంది: పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Paid Tributes to Dr Ram Manohar Lohia on His Birth Anniversary,Janasena Chief Pawan Kalyan,Pawan Kalyan Paid Tributes to Dr Ram Manohar Lohia,Dr Ram Manohar Lohia Birth Anniversary,Mango News,Mango News Telugu,Dr. Ram Manohar Lohia Hospital,Dr. Rammanohar Lohia Avadh University,Dr Ram Manohar Lohia Latest News,Janasena Chief Pawan Kalyan Live Updates,Janasena Chief Pawan Kalyan Latest News,Dr Ram Manohar Lohia Birth Anniversary News

రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలు, ఆలోచన ప్రభావం జనసేన పార్టీ సిద్ధాంతాలపై, పోరాట పంథాపై ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. “దేశంలో కుల సమస్య, కులాలపై శాస్త్రీయ అవగాహన, వాటి పుట్టుపూర్వోత్తరాలు సాంస్కృతిక జీవనం గురించి సాధికారికంగా విశాల దృక్పథంతో మాట్లాడిన మహనీయులు రామ్ మనోహర్ లోహియా. ఆయన ప్రతిపాదించిన సోషలిస్ట్ సిద్ధాంతాలను అర్ధం చేసుకొంటే అన్ని వర్గాల ప్రజలు సామరస్య భావనతో ముందుకు వెళ్తారు. సమసమాజ స్థాపన కోసం తపించిన ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా హృదయపూర్వక అంజలి ఘటిస్తున్నాను. జనసేన పార్టీ సిద్ధాంతాలపైనా, పోరాట పంథాపైనా రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలు, ఆలోచన ప్రభావం ఉంది. ఎలుగెత్తు…ఎదిరించు.. ఎన్నుకో…అనే జనసేన పోరాట విధానానికి రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలే స్ఫూర్తి” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“కులాలను కలిపి ఆలోచనా విధానం అనేది జనసేన సిద్ధాంతాల్లో ఒకటి. లోహియా చెప్పిన విధంగా కులాల మధ్య అంతరాలు తగ్గించడం వర్తమాన సమాజానికి ఎంతో శ్రేయస్కరం. ఆంధ్రప్రదేశ్ కుల వ్యవస్థపై లోహియాకి సాధికారత ఉంది. ఆయన ఇక్కడి కుల విధానాలు గురించి చెబుతూ రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కులాలు ఏ విధంగా ముందుకు వెళ్లాలో ‘ది క్యాస్ట్ ఇన్ ఇండియా’ పుస్తకంలో వివరించారు. కేవలం కుల వ్యవస్థపైనే కాదు మహిళా సాధికారతతో భారతీయ సమాజ వికాసం గురించి కూడా ఎంతో విపులంగా చెప్పారు. లోహియా సిద్ధాంతాలు ప్రతిపాదించడమే కాదు వాటిని తన ప్రజా జీవితంలో ఆచరించి చూపారు. వర్తమాన సమాజం, ముఖ్యంగా యువత లోహియా సిద్ధాంతాలు అర్ధం చేసుకుంటే కులాల సంక్లిష్టత నుంచి బయటపడవచ్చు” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 3 =