గుజరాత్ రాష్ట్రంలో ఫసల్ బీమా ఎందుకు అమలు చెయ్యట్లేదు?, బండి సంజయ్ ను ప్రశ్నించిన మంత్రి హరీశ్ రావు

Why Not Implement PM Fasal Bima Yojana in Gujarat State Minister Harish Rao Questions State BJP Chief Bandi Sanjay,Why Not Implement PM Fasal Bima Yojana in Gujarat,State Minister Harish Rao Questions,Harish Rao Questions Bandi Sanjay,State BJP Chief Bandi Sanjay,Mango News,Mango News Telugu,PM Fasal Bima Yojana News Today,Telangana BJP Chief Bandi Sanjay Kumar News,State Minister Harish Rao Latest News,State Minister Harish Rao Latest Updates,Harish Rao vs Bandi Sanjay

రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.10 సాయం అందించడం, ఫసల్ బీమా అమలు వంటి విషయాలపై రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఫసల్ బీమా ఎందుకు అమలు చెయ్యట్లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

“తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలని అడుగుతున్న బండి సంజయ్..ముందు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలవా..?, దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా బీజేపీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. దీనిని బట్టే ఆ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదని అర్థం కావడం లేదా?” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

“పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10 వేలు సాయం చొప్పున, రూ.228 కోట్లు ప్రకటించి రైతు బిడ్డనని మరోసారి నిరూపించుకున్నారు. బీజేపీ నేతలకు ఇది చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరం. దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్టు నిరూపించగలరా?, నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, నేడు ఆదాని ఆదాయాన్ని డబుల్ చేశారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ, నల్ల చట్టాలు తెచ్చి రైతులను బలి చేసిన చరిత్ర మీది. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత మాది. సాగు, రైతు సంక్షేమం గురించి బీజేపీ నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమే” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here