అమెరికాలో ఏవియేష‌న్ సిస్ట‌మ్ ఫెయిల్యూర్.. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు

Widespread Flight Delays Across The United States After FAA Computer Outage,United Airlines System Down Today,United Airlines Problems Today,Southwest Airlines Issues Today,Flight Grounded Meaning,Mango News,Mango News Telugu,Flight Failures,Failed American Airlines,American Airlines System Down 2023,American Airlines System Crash,American Airlines Servers Down,American Airlines Issues Today,American Airlines Incident Today,American Airlines Grounded Today,American Airlines Flights Cancelled Today,American Airlines Failure,American Airlines Computer System Down,American Airlines Booking System Down,All Flights Grounded Today,Airline System Outage Today,Aircraft System Failures

అగ్రరాజ్యం అమెరికాలో విమాన సర్వీసులకు భారీ అంతరాయం ఏర్పడింది. ఏవియేష‌న్ సిస్ట‌మ్ లోని ప్రధాన వ్యవస్థ నోటీస్ టు ఎయిర్ మిషన్స్ (నోటామ్)లో సాంకేతిక లోపం కార‌ణంగా వైఫల్యం చెందడంతో ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. కాగా పైలట్లు, విమాన కార్యకలాపాల్లో పాల్గొనే ఇతర సిబ్బందికి ముఖ్యమైన సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడానికి ఈ నోటామ్ సహాయపడుతుంది. ఈ మేరకు దీనికి సంబంధించి ఎఫ్ఏఏ వెబ్‌సైట్ కీలక ప్రకటన చేసింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్ఏఏ)లో కీలకమైన సమాచారం చేరవేసే కంప్యూటర్ లో సమస్య ఏర్పడటంతో యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) అంతటా అనేక ప్రదేశాలలో విమానాలు ఆలస్యం అవుతున్నాయని వెల్లడించింది. ఎయిర్ మిషన్స్ సిస్టమ్‌కు నోటీసును పునరుద్ధరించే పనిలో ఉన్నట్లు ఏజెన్సీ ఒక ట్వీట్‌లో తెలిపింది. ప్రస్తుతం తాము సిస్టమ్‌ను రీలోడ్ చేస్తున్నట్లు అందులో పేర్కొంది. కాగా దీనిలో ఎయిర్‌పోర్ట్‌లలో నిర్మాణం గురించిన సాధారణ సమాచారం నుండి అత్యవసర విమాన హెచ్చరికలు వంటి సమాచారం ఉంటుంది. దీంతో దేశవ్యాప్తంగా గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. ప్రయాణికులు విమానాశ్రయాలలోనే చిక్కుకు పోయారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − eleven =