చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కీలక నిర్ణయం, బీజేపీలో చేరతానని ప్రకటన

Former MP Konda Vishweshwar Reddy Confirmed His Joining to Bharatiya Janata Party, Konda Vishweshwar Reddy Confirmed His Joining to Bharatiya Janata Party, Former MP Konda Vishweshwar Reddy Confirmed His Joining to BJP, EX-MP Konda Vishweshwar Reddy Confirmed His Joining to BJP, Bharatiya Janata Party, Former MP Konda Vishweshwar Reddy, EX-MP Konda Vishweshwar Reddy, MP Konda Vishweshwar Reddy, Konda Vishweshwar Reddy, Former MP, Former MP Konda Vishweshwar Reddy Join BJP News, Former MP Konda Vishweshwar Reddy Join BJP Latest News, Former MP Konda Vishweshwar Reddy Join BJP Latest Updates, Former MP Konda Vishweshwar Reddy Join BJP Live Updates, Mango News, Mango News Telugu,

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరనున్నట్టు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటన చేశారు. గురువారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొన్ని రోజులుగా బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నానని, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే బీజేపీతోనే సాధ్యమని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పదవులు ఆశించి బీజేపీలోకి వెళ్లడం లేదని, సాధారణ కార్యకర్తగానే చేరుతానని అన్నారు. బీజేపీలో ఎప్పుడు, ఎక్కడ చేరాలనేది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయానికే వదిలేశానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం పోయిందని, అయితే రేవంత్ రెడ్డికి తాను వ్యతిరేకంగా కాదు అని, అతనికి సకాలంలో పీసీసీ బాధ్యతలు అప్పజెప్పలేదన్నారు. మరోవైపు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ట్విట్టర్ లో ఎక్కువుగా యాక్టీవ్ ఉండే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరడంపై స్పందించారు. “భారతీయ జనతా పార్టీలో చేరాలనే నా నిర్ణయాన్ని ధృవీకరిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

గత ఏడాది మార్చి నుంచే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ వీడి, దూరంగా ఉంటున్నారు. అప్పటినుంచే ఆయన బీజేపీ పార్టీలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలు సంప్రదింపుల అనంతరం చివరికి ఆయన బీజేపీ వైపే మొగ్గుచూపుతూ నిర్ణయాన్ని ప్రకటించారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 2014 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే 2018లో పార్టీలో విభేదాల కారణంతో టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌ లో చేరారు. కొంత విరామం తరువాత తన క్రియాశీల రాజకీయ ప్రయాణాన్ని మళ్ళీ బీజేపీ నుంచి ప్రారంభించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =