టీఎస్‌పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

YSRTP Chief YS Sharmila House Arrested After Called For Protest at TSPSC Office Hyderabad,YSRTP Chief YS Sharmila House Arrested,YSRTP Chief YS Sharmila Called For Protest,Protest at TSPSC Office Hyderabad,Mango News,Mango News Telugu,Sharmila Protests At Tspsc Latest News,Sharmila Protests At Tspsc Latest Updates,YSRTP Chief YS Sharmila Latest News,YSRTP Chief YS Sharmila Live News,YS Sharmila House Arrested News Today,Telangana TSPSC Office Latest Updates

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ వచ్చిన వైఎస్ షర్మిల.. టీఎస్‌పీఎస్సీ పరీక్షా పత్రం లీక్‌ను నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా శుక్రవారం టీఎస్‌పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన షర్మిల.. ఈ క్రమంలో నేడు తన నివాసం నుంచి టీఎస్‌పీఎస్సీ ముట్టడికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ముందుగా షర్మిల ఇంటి దగ్గర బలగాల్ని మోహరించిన పోలీసులు, తర్వాత హౌస్ అరెస్ట్ చేసి ఆందోళన చేయకుండా కట్టడి చేశారు. దీంతో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక పేపర్ లీక్ వ్యవహారంతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు టీఆర్ఎస్ భవన్, ప్రగతి భవన్ మరియు టీఎస్‎పీఎస్సీ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇక తనను హౌస్ అరెస్టు చేయడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగుల పక్షాన శాంతియుతంగా పోరాడుతుంటే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని, టీఎస్ పీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 13 =