తెలంగాణలో నిర్మించే జాతీయ రహదారులకు భూసేకరణ ప్రక్రియపై సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

Union Minister Kishan Reddy Writes to CM KCR on Land Acquisition Process for National Highways to be Built in Telangana,Union Minister Kishan Reddy Writes to CM KCR,Kishan Reddy Writes on Land Acquisition Process,National Highways to be Built in Telangana,Union Minister Kishan Reddy on National Highways,Mango News,Mango News Telugu,National Highway Projects,Union minister Reddy urges Telangana CM,Kishan Reddy seeks KCRs Help,Telangana National Highways Latest News,Hyderabad National Highways Live Updates,CM KCR News And Live Updates

కేంద్ర ప్రభుత్వం “భారతమాల పరియోజన” కార్యక్రమం క్రింద జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి, ఆయా రహదారుల నిర్మాణానికి సహకరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు.

రూ.32,383 కోట్లతో 751 కి.మీ.ల పొడవున తెలంగాణలో నిర్మించనున్న 11 జాతీయ రహదారులకు 4,332 హెక్టార్ల భూమి అవసరం కాగా కేవలం 284హెక్టార్ల భూమిని మాత్రమే ఎన్ హెఛ్ఏఐకు అప్పగించారని కిషన్ రెడ్డి తెలిపారు. మిగిలిన భూమినికూడా సకాలంలో అందించేలా చర్యలు తీసుకొని ప్రాజెక్టులు సమయానికి పూర్తవటానికి సహకరించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు లేఖ రాసినట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు రాసిన లేఖను జత చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 19 =