సలాం ఆటోవాలా సలాం

Bainsa auto boy in Telangana,Bhainsa Auto Driver,Bhainsa Auto Driver Saheb Rao Kamble,Kamble Saheb Rao,Mango News,Mango News Telugu,Saheb Rao,Bhainsa Auto Driver Saheb Rao,Bhainsa Auto Driver Saheb Rao Latest News,Bhainsa Auto Driver Saheb Rao Updates,Bhainsa Auto Driver Saheb Rao Latest News and Updates,Kamble Saheb Rao Auto Driver

సాయం కోరితే ఆమడ దూరం పారిపోయే ఈ రోజుల్లో.. అడిగిన వెంటనే ఎండా, వాన, రాత్రి, పగలు తేడా లేకుండా సహాయం చేస్తూ.. చిన్నవయసులో పెద్ద మనసును చాటుకుంటున్నాడు ఓ ఆటో వాలా. నిర్మల్​ జిల్లా భైంసాలోని పిప్రీ కాలనీలో ఉండే కాంబ్లే సాహెబ్​రావు ..సాయం కోసం ఏ గర్భిణీ ఇంటి నుంచి ఫోన్​ వచ్చినా అర్ధరాత్రి కూడా తన ఆటోతో సహా క్షణాల్లో వాలిపోతాడు సాహెబ్​రావు. వాళ్లను హాస్పిటల్​‌కు తీసుకెళ్లి, తిరిగి క్షేమంగా ఇంట్లో దిగబెడతాడు . అంతేకాదు వాళ్లకు ఆడపిల్ల పుడితే ఆరునెలల దాకా తల్లీబిడ్డల్ని చెకప్​‌కు​ తీసుకెళ్లే బాధ్యతను కూడా తీసుకుంటాడు.

కాంబ్లే సాహెబ్​రావు తండ్రి తాపీ పని చేస్తూ ఉండేవారు . కానీ అతను అనారోగ్యంతో ఇంటికే పరిమితమవడంతో.. సాహెబ్రావు తల్లి నాగమణి బీడీలు చుడుతూ ముగ్గురు పిల్లల బాధ్యతను తీసుకుంది. కానీ ఆర్థిక పరిస్థితులను అర్ధం చేసుకున్న సాహెబ్రావు ఇంటర్‌తో చదువు ఆపేశాడు. కుటుంబం కోసం ఆటోడ్రైవర్‌గా మారాడు. అయితే ఓ సంఘటన నలుగురికి సాయపడేలా ప్రేరేపించింది.
ఏడాది క్రితం సాహెబ్​రావు ఫ్రెండ్ కూతురు పుట్టింది . కానీ పుట్టిన కొద్ది రోజులకే అనారోగ్యం పాలయి హాస్పిటల్‌కు తీసుకెళ్లడం ఆలస్యం అవడంతో దారిలోనే పాప చనిపోయింది. దీంతో బాగా చలించిపోయిన సాహెబ్​రావు..ఇలాంటి సమస్య ఇంకెవరికీ రానీకూడదనుకున్నాడు. తన ఫ్రెండ్​ కూతురుకి ఎదురైన ఆ సమస్యే అతన్ని ఆలోచింపజేసింది. గర్భిణీల కోసం ఫ్రీ ఆటో సర్వీస్​ మొదలుపెట్టించింది.

ఆ పాపలా ఇంకో పాప బలి కాకుడదనే..బాలింతలతో పాటు గర్భిణీలను టైంకి హాస్పిటల్‌కు చేర్చడానికి ఫ్రీ ఆటో సర్వీస్​ మొదలుపెట్టాడు. ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా సాయం కోసం ఫోన్ వస్తే చాలు.. వెంటనే వారిని హాస్పిటల్‌కు తీసుకువెళ్తాడు. ఇలా ఏడాది నుంచి కొన్ని వందల మందికి సాయం చేశాడు సాహెబ్​రావు​. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో రెట్టింపు చార్జీలు వేస్తూ మాడు పగుల కొడుతున్న మిగిలిన ఆటోడ్రైవర్లు.. సాహెబ్​రావును చూసి కాస్తయినా మారాలని గ్రామస్తులు అంటున్నారు. ఇలాంటి వ్యక్తి తమ గ్రామంలో ఉన్నందుకు గర్వ పడుతున్నామని చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here