మనిషికి పంది కిడ్నీ ప్రయోగం సక్సెస్ .. భవిష్యత్తుపై ఆశలు

Human Pig Kidney Experiment,Human Kidney Experiment Success,Human Pig Kidney Experiment Success,Mango News,Mango News Telugu,Kidney Experiment,Kidney Bean Experiment,Pig Kidney Works,Pig Kidney Transplant Experiment,Us Surgeons Transplant Pig Kidney,Pig Kidneys Transplanted,Pig Kidney Xenotransplantation,Pig Kidney In A Human Body,Pig Kidney Transplant 2023,Pig Kidney Transplant Update,Pig Kidney Transplant Latest News

మనిషికి వివిధ అనారోగ్యాలలో అవయవాలు విఫలమయితే..వెంటనే వేరే వారి అవయవాలను అమర్చితేనే మళ్లీ జీవితం సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్నికొన్సి సార్లు సరైన సమయానికి అవయవాలు దొరకకపోవడం, ఒకవేళ దొరికినా సెట్ కాకపోవడం వల్ల చాలామంది చనిపోతున్నారు. ఇలాంటి సమస్యలలో ఎక్కువ మంది బాధపడేది కిడ్నీ ట్రాన్స్‌ఫ్లాంటేషన్.

అందుకే అవయవాల కొరతకు పరిష్కారం చూపించేలా శాస్త్రవేత్తలు, డాక్టర్లు కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అలాగే ఈ మధ్య జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని మనిషకి అమర్చగా.. ఇది ఏకంగా డాక్టర్లు కూడా ఊహించని విధంగా రెండు నెలల పాటు పని చేసింది. ఈ ప్రయోగం భవిష్యత్తుపై ఆశలను పుట్టించినట్లు అయింది. బ్రెయిన్ డెడ్ అయిపోయి, వెంటిలేటర్ పై ఉన్న ఓ వ్యక్తికి.. రెండు నెలల క్రితం పంది కిడ్నీని అమర్చి అబ్జర్వేషన్‌లో పెట్టారు.

న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్ హెల్త్‌లో పని చేస్తున్న ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్.. డాక్టర్ రాబర్ట్ మోంట్‌గోమెరీ నేతృత్వంలో పంది కిడ్నీ ప్రయోగం సెప్టెంబర్ 14న ముగిసింది. బ్రెయిన్ డెడ్ అయిన మిల్లర్ అనే వ్యక్తి కిడ్నీని ఇటీవల తొలగించి, అతనికి పంది కిడ్నీని అమర్చారు.తర్వాత రెండు నెలల పాటు అతడిని వెంటిలేటర్ పై ఉంచి డాక్టర్ల బృందం ఈ పరిశోధన సాగించింది. ఈ ప్రయోగం విజయవంతం అయ్యాక.. తాజాగా మిల్లర్ శరీరం నుంచి పంది కిడ్నీని తొలగించి అతడిని అంత్యక్రియలకు పంపారు.

ఈ ప్రయోగంలో జన్యుపరంగా మార్పు చేసిన పంది కిడ్నీ..మనిషి శరీరంలో ఎక్కువ కాలంగా పనిచేసినట్లు గుర్తించారు.దీంతో ఈ ప్రయోగ ఫలితాలను మీడియాతో పంచుకున్నారు. క్యాన్సర్ వల్ల బ్రెయిన్ డెడ్ అయిన మిల్లర్ శరీరాన్ని పరిశోధన కోసం వాడుకోవడానికి మిల్లర్ .. సోదరి మేరీ మిల్లర్ డఫీ తన సోదరుడి శరీరాన్ని దానం చేశారు. జులై 14న మిల్లర్ పుట్టిన రోజుకు కొద్ది రోజుల ముందు డాక్టర్లు అతడి కిడ్నీని తొలగించి.. జన్యుపరంగా మార్పులు చేసిన పంది కిడ్నీని అమర్చారు.

ఈ ప్రయోగంలో పంది కిడ్నీకి, దాని థైమస్ గ్రంథిని మిల్లర్‌కి అమర్చారు. ఈ థైమస్ గ్రంథితో రోగనిరోధక కణాలకు డాక్టర్లు శిక్షణ ఇచ్చారు. అయితే ఈ కిడ్నీ ఒక నెలపాటు విజయవంతంగా.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పని చేసింది.కానీ ఈ తర్వాతి నెలలో మాత్రం మిల్లర్‌లో మూత్రం తగ్గిపోవడం వంటి సమస్యలను డాక్టర్లు గుర్తించారు. అంటే మనిషి శరీరం పంది కిడ్నీని తిరస్కరిస్తుందని చెప్పడానికి ఇదే ప్రథమ సంకేతమని డాక్టర్లు గుర్తించారు. అయితే ఈ ప్రమాదాన్ని కూడా ఇమ్యూన్ సప్రెస్ మెడిసిన్స్‌తో డాక్టర్లు పరిష్కరించారు.

గతంలో కూడా ఇలాగే వేరే జంతువు అవయవాలను అమర్చినప్పుడు కొద్ది రోజుల్లోనే మనిషి శరీరం వెంటనే రిజెక్ట్ చేసేది. కానీ ఇప్పుడు జన్యుపరంగా మార్పు చెందిన పంది అవయవాల ద్వారా.. భవిష్యత్తులో జంతు అవయవాలను మనిషిలో అమర్చి వారి జీవితకాలాన్ని పొడిగించవచ్చే ఆశను కల్పించింది. దీంతో తమ తర్వాత పరిశోధనల్లో జెనోట్రాన్స్‌ప్లాంట్ వల్ల.. వేరే ఏవైనా సమస్యలు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి .. ప్రధాన అవయవాలు, జీర్ణాశయ వ్యవస్థలోని 180 రకాల టిష్యూలపై పరిశోధనలు చేస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − five =