నిద్రపోయే ముందు నీళ్లు తాగితే ఏం జరుగుతుంది?

What happens if you drink water before going to sleep,What happens if you drink water,Drink water before going to sleep,Mango News,Mango News Telugu,Drinking Water,drink water before going to bed,drink water before going to sleep, Drink Water, Before Going to Sleep,Is Drinking Water at Night Before Bed,Water Before Bed Impacts Sleep,Best Time to Drink Water,Drinking Water Latest News
Drinking Water,drink water before going to bed,drink water before going to sleep, drink water, before going to sleep

మన శరీరానికి నీళ్లు చాలా అవసరం. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి మనిషికి నీళ్లే అవసరం. చివరకు బాడీలోని మలినాలు బయటకు పోవడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి  కూడా  నీళ్లు తాగుతూ ఉండాలి.

ప్రతీరోజూ ఒక మనిషి 3 నుంచి  4 లీటర్ల నీటిని కచ్చితంగా తాగాలని డాక్టర్లు చెబుతూ  ఉంటారు. అయితే నీటిని తాగే విషయంలో చాలా మందికి ఇప్పటికీ బోలెడు అపోహలు కలిగి ఉన్నారు. కొంతమంది ఎంత దాహం వేసినా కూడా రాత్రి పడుకునే ముందు నీటిని తాగకూడదు అంటూ తాగడం మానేసి అలాగే తాగకుండా పడుకుంటారు.

మరి కొంతమంది అయితే  రాత్రి  పడుకునే ముందు నీటిని తాగినా  ఎక్కువగా తాగకూడదని చెబుతూ ఉంటారు. ఇలాంటప్పుడే అసలు రాత్రి పూట నీటిని ఎక్కువగా తాగాలా..వద్దా అని చాలామందికి అనుమానాలు వస్తుంటాయి. నిజానికి రాత్రి పూట నీటిని తాగడం మంచిదేనట. డాక్టర్లు ఇదే చెబుతున్నారు.

కొంతమంది మాత్రం రాత్రి నీళ్లు తాగకూడదని డాక్టర్లు చెబుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వాళ్లు, గుండె సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు రాత్రి పూట నీటిని ఎక్కువగా తీసుకోకూడదని  వారు చెబుతున్నారు. ఉదయం పూట అలా  పని చేస్తూనే ఉంటాము. దీంతో మన శరీరం నీటిని ఎక్కువగా కోల్పోవడంతో.. శరీరంలో నీటి శాతం తగ్గుతుంది.

శరీరంలో తగినంత నీటి శాతం లేకుండా.. రాత్రి పూట నీళ్లు తాగకుండా  పడుకోవడం వల్ల మనం ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. రాత్రి పడుకునేటపుడు శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల గొంతు ఆరిపోతుంది. శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. అంతేకాదు నీళ్లు సరిగా తాగకపోతే గురక ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

అందుకే  ఎవరైనా సరే వాళ్లు పడుకునే సమయానికి శరీరానికి కావాల్సిన నీటి శాతం బాడీలో ఉండేటట్లు  చూసుకోవాలి.  రాత్రి పడుకునేటప్పుడు శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల శరీరం యొక్క అలసట తగ్గుతుంది. అంతేకాకుండా చక్కని నిద్ర  పడుతుంది. దీంతో మనం ఉదయం లేచాక ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము.లేదంటే నీరసం, నిస్సత్తువ ఉంటుంది.

రాత్రిపూట అందులోనూ పడుకునే ముందు నీటిని తాగడం వల్ల.. శరీరంలో మలినాలు తొలగిపోతాయి. మలినాలు తొలిగిపోవడంతో.. చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు శరీరంలో వేడి చేయడం వంటి సమస్యలు తగ్గుతాయి. కాకపోతే  రాత్రి పూట పడుకునే అరగంట ముందు నుంచీ నీటిని తాగడం ఆపేయాలి.అలాగే ఉదయం పూట తాగినంత వాటర్ తాగకూడదు.

పడుకునే ముందు మంచినీళ్లు  ఎక్కువగా తాగడం వల్ల .. మధ్యలో లేచి  మూత్రవిసర్జనకు ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది.దీనివల్ల  మంచి నిద్రకు ఆటంకం కలిగినట్లు అవుతుంది. అలాగే పొట్ట నిండా నీటిని తాగి పడుకోవడం వల్ల శ్వాసలో ఇబ్బందులు కలగడం, గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 10 =