సిస్టమ్ ముందు కూర్చుని గంటల తరబడి పని చేస్తే త్వరగా చనిపోతారా?

Do You Die Quickly If You Sit in Front of the System and Work for Hours,If You Sit in Front of the System,Sit in Front of the System and Work for Hours,Mango News,Mango News Telugu,Die Quickly, Sit in Front of the System, Work for Hours, Sitting Too Long Can Kill You, a Recent Study,How Harmful Is Too Much Sitting,Sitting in Front of a Computer, a 38% Risk of Early Death,Sitting in Front of a Computer Latest News,Sitting in Front of a Computer Latest Updates
die quickly, sit in front of the system, work for hours, A recent study,sitting in front of a computer, a 38% risk of early death,

సాఫ్ట్ వేర్ వాళ్లు మాత్రమే కాదు.. మీడియా, హార్డ్ వేర్, మెడికల్, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంట్ సెక్షన్ ఇలా చాలామంది ఇప్పుడు కంప్యూటర్ వాడుతున్నారు.  కంప్యూటర్ ముందు కూర్చుని అదే పనిగా గంటల తరబడి వర్క్ చేస్తున్నారు. కరోనా వల్ల ప్రారంభమయిన వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్.. కొన్ని చోట్ల హైబ్రిడ్ కల్చర్‌గా కొనసాగుతుంది. దీనివల్ల వారానికి ఒకటి, రెండు రోజులు ఆఫీసుకు వెళ్లి వర్క్ చేయాలి. మిగిలిన రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు.

అయితే ఆఫీసు పనిగంటలతో పోలిస్తే.. వర్క్  ఫ్రమ్ హోమ్ పనిగంటలు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. దీనికి తోడు మూన్ లైటింగ్ పేరుతో కొంతమంది ఒకటి,రెండు కంపెనీలలో ఉద్యోగం చేస్తున్నారు. దీనివల్ల 12,13 గంటలు సిస్టమ్స్ ముందు కూర్చుని పని చేస్తున్నారు.  అయితే ఇలాంటివారికి  తాజా అధ్యయంన బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇతరులతో పోలిస్తే సిస్టమ్ ముందు కూర్చుని గంటల తరబడి పని చేసినవాళ్లకు 38% ముందస్తు మరణానికి ప్రమాదం ఉందని  తాజా అధ్యయనం హెచ్చరించింది.

డెన్మార్క్‌లోని ఆర్హస్ విశ్వవిద్యాలయంతో పాటు నార్వేలోని ట్రోమ్స్ విశ్వవిద్యాలయంలోని  పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నార్వే, స్వీడన్‌లలో 50  అంతకంటే ఎక్కువ వయస్సు గల వారిపై నిర్వహించిన ఓ స్టడీలో ఈ విషయాన్ని గుర్తించినట్లు పరిశోధకులు చెప్పారు.

వీరి అధ్యయనం ప్రకారం..రోజుకు 12 గంటల కంటే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని గడిపిన వ్యక్తులకు మరణ ప్రమాదం ఎక్కువగా ఉందని  పరిశోధకులు హెచ్చరించారు. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, మస్క్యులోస్కెలెటల్ సమస్యలు వస్తాయని పరిశోధకులు గుర్తించారు.

అంతేకాదు ఇలా గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చుని  పనిచేసిన వారిలో  కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాలు, జీవక్రియ నెమ్మదించడం వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీసి చివరకు  త్వరగా చనిపోయే ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు.  అయితే  దీనికి  ఓ సొల్యూషన్ ఉందని అంటున్నారు.   ఇలా పనిచేసేవాళ్లు ప్రతిరోజూ కేవలం 20 నుంచి 25 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల ఈ  ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇలా చేసే  ఎక్సర్ సైజ్ ఇంటెన్సివ్ గా ఉండాల్సిన అవసరం లేదని పరిశోధకులు చెప్పారు. వేగంగా నడవడం,యోగా, వ్యాయామాలు, సైకిల్  రైడ్ వంటివి చేయడం ఇది వీలుకాకపోయినా.. కనీసం పిల్లలు లేదా పెంపుడు జంతువులతో ఆడుకోవడం వంటి కార్యకలాపాలు కూడా గణనీయమైన మార్పును కలిగిస్తాయని గుర్తించినట్లు చెప్పారు. కానీ సైక్లింగ్, రన్నింగ్, ఇతర ఎక్సర్‌సైజులు  మరింత ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయని అన్నారు. అసలు ఏమీ చేయకుండా ఉండేకంటే కూడా.. కాస్త దూరం నడిచినా కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 3 =