మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా టీచర్లందరికీ ‘ఉపాధ్యాయ దినోత్సవ’ శుభాకాంక్షలు – ప్రధాని మోదీ

PM Modi Extends Teachers Day Greetings and Pays Homage To Ex-President Radhakrishnan on His Birth Anniversary, PM Modi Greets Teachers Community, PM Modi Extends Greetings To Teachers, PM Modi Greets Teachers on Teachers Day, Teachers Day 2022, Mango News , Mango News Telugu, PM Modi extends Teachers Day greetings, Happy Teachers Day 2022, PM Narendra Modi ,Former President Sarvepalli Radhakrishnan, Teachers Day Latest News And Updates

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టీచర్లందరికీ ‘ఉపాధ్యాయ దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. యువకులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అనితరసాధ్యమని ఆయన కొనియాడారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఉపాధ్యాయులను ఉద్దేశించి ఒక సందేశాన్ని ఇచ్చారు. అందులో ఆయన.. ‘ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, ముఖ్యంగా యువ మనస్సులలో విద్య యొక్క ఆనందాన్ని పంచే కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు. మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నేను ఆయనకు నివాళులర్పిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

కాగా నేడు నేషనల్ టీచర్స్ అవార్డ్స్ 2022 వేడుక న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా విద్యారంగంలో విశేష సేవలందించిన దేశవ్యాప్తంగా ఎంపికైన 46 మంది ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ జాతీయ ఉపాధ్యాయ అవార్డుల విజేతలను తన నివాసంలో కలవనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ