డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు

Check Your Vote In The New Voter List, Check Your Vote, New Voter List, Voter List 2024,TDP, Janasena, YCP, Congress, BJP, Latest Voter List News, Assemble Elections, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Voter List 2024,TDP, Janasena, YCP, Congress, BJP,Check your vote, new voter list,

దేశంలో  చాలా వేగంగా జరుగుతున్న డిజిటలైజేషన్‌ను అనుసరిస్తూ.. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మాధ్యమం ద్వారా  కొన్ని సేవలను అందించే అధికారిక వెబ్ సైట్లను ప్రారంభించింది. దీంతో ఇకపౌ ఓటర్ల జాబితాలను  కూడా ఆన్‌లైన్‌లోనే చూసుకోవచ్చు.  సీఈఓ ఓటర్ లిస్ట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి.. సి.ఇ.ఒ ఓటరు జాబితాను చూడొచ్చు.

ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి  ఏ గవర్నమెంటు ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు.  https://voters.eci.gov.in అనే అధికారక వెబ్సైట్ వెళితే  అక్కడున్న ఓటరు జాబితాలో మీ పేరు కనిపిస్తుంది.  ఏ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల లిస్టు.. ఆ  రాష్ట్ర సీఈవో లేదా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది.

ముందు నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అఫీషియల్ వెబ్‌సైట్ అయిన  https://voters.eci.gov.in లోకి వెళ్లి.. హోమ్ పేజీలో ఉన్న సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ ఓటరు జాబితాలో సెర్చ్ చేసి.. డిస్క్రిప్షన్ ద్వారా సెర్చ్ లేదా ఐడెంటిటీ కార్డ్ ద్వారా సెర్చ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ తరువాత, అందులో  మీ పేరు, వయస్సు, డేట్ ఆఫ్ బర్త్, రాష్ట్రం, జిల్లా మొదలైన అన్ని డిటైల్స్ ఎంటర్ చేసి.. ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా కోసం  (https://ceoandhra.nic.in) ఈ సైట్‌లోకి వెళ్లాలి.

సీఈఓ ఓటరు జాబితాలో  ఈ-ఎపిక్ డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. దీనికోసం  https://voters.eci.gov.in/ లోకి వెళ్లి.. హోమ్ పేజీలో ఉన్న ఈ-ఎపిక్ డౌన్లోడ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. యూజర్ నేమ్, పాస్ వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి..తర్వాత లాగిన్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దాని తర్వాత  మీ ఎపిక్ నంబర్ లేదా రిఫరెన్స్ నంబర్‌ను ఎంటర్ చేసి  రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే..ఎపిక్ కనిపిస్తుంది. దాని తర్వాత  డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. ఎపిక్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here