తెనాలిలో వైసీపీ, కూటమి మధ్య ఎన్నికల వార్

Election War Between YCP And Kutami In Tenali, YCP And Kutami In Tenali, War Between YCP And Kutami, YCP And Kutami War In Tenali, TDP, Janasena, YCP, Congress, BJP, Opposition To YCP, Election War, Tenali, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
TDP, Janasena, YCP, Congress, BJP, opposition to YCP,Election war , Tenali

తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైసీపీ, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మళ్లీ  పాగా వేయాలని ప్రయత్నిస్తుండగా..గత ఎన్నికలలో ఓడిపోయిన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్..ఈ సారి  కూటమి ఉమ్మడి అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

తెనాలిలో బీసీ, కాపు, కమ్మ, మాదిగ, మాల, ఆర్యవైశ్య,ముస్లిం ఓటర్లతో పాటు.. పట్టణ ఓటర్లు కూడా ఎక్కువే. గతంలో తెనాలి నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ, ఆయన కుమారుడు అన్నాబత్తుని శివకుమార్, దొడ్డపనేని ఇందిర, ఆమె కుమార్తె గోగినేని ఉమ పోటీ చేశారు.

అయితే ఇక్కడ వైసీపీపై కాస్త ఎక్కువ వ్యతిరేకతే ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కరువవ్వడంతో యూత్ కూడా వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దీని వల్ల ఉపాధి కోసం అనేక మంది ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది.  ప్రస్తుత ఎమ్మెల్యే శివకుమార్‌ .. తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్న అసంతృప్తి అక్కడి వారిలో కనిపిస్తుంది.

తెనాలి-విజయవాడ మధ్య రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగాయన్న ఆవేదన తెనాలి వాసుల్లో క్లియర్ గా కనిపిస్తోంది.  అంతేకాదు వైసీపీ ప్రభుత్వ హయాంలో తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రాజక్టులు, రోడ్డు ప్రాజెక్టులు అటకెక్కడంతో ఎమ్మెల్యేను ప్రశ్నించినా సమాధానం లేకపోవడం వైసీపీకి మైనస్‌గా మారనుంది. ఇదే సమయంలో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో నాదెండ్ల మనోహర్‌ విశేష పాత్ర పోషించారన్న కృతజ్ఞతతో పాటు గత ఎన్నికలలో మనోహర్ ను ఓడించామన్న పశ్చాత్తాపం  అక్కడ వారిలో  కనిపిస్తోంది.

ఇక గుంటూరు లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెనాలి ఒకటి. నియోజకవర్గంలోని రెండు మండలాలు అయిన తెనాలి, కొల్లిపరలో సుమారు 2.62 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ కమ్మ సామాజికవర్గానిదే ప్రధాన ఓటు బ్యాంకు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే అన్నాబత్తిన శివ కుమార్  45.92 శాతం ఓట్లతో.. టీడీపీ నుంచి పోటీచేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, జనసేన తరపున పోటీ చేసిన నాదెండ్ల మనోహర్‌లపై విజయాన్ని సాధించారు.

1952 నుంచి తెనాలి నియోజకవర్గాన్ని పరిశీలిస్తే.. 1952, 1955, 1962, 1989, 2009లో ఐదుసార్లు కాంగ్రెస్‌ గెలుపొందగా.. 1978 లో మాత్రం జనతా పార్టీ గెలుపొందింది. 1983, 1985, 1994, 1999, 2014లో టీడీపీ గెలుపొందగా.. 2019లో వైసీపీ విజయాన్ని సాధించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 6 =