నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా ఆ ఎమ్మెల్సీకి ఛాన్స్?

MLC, Nellore, YCP, Nellore YCP Candidate, A Chance for that MLC as Nellore YCP Candidate, YCP Candidate, AP Elections, Jagan, YSRCP , Nellore MLC Election, MLC Candidats, Andhra Pradesh Legislative Assembly, AP Elections, Mango News Telugu, Mango News
Nellore, YCP Candidate, AP Elections, Jagan

ఎన్నికలు ముంచుకొస్తుండడంతో దూకుడుగా ముందుకెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అందరికంటే ముందే తమ అభ్యర్థులను బరిలోకి దించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈక్రమంలో పెద్ద ఎత్తున సిట్టింగ్‌లకు షాక్ ఇస్తూనే.. కొందరు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి.. ఎమ్మెల్యేలను లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపుతున్నారు.  నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. నరసరావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్‌ను పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారు.

ఇటీవల నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయాలని శ్రీకృదేవరాయలును వైసీపీ హైకమాండ్ ఆదేశించింది. అయితే తనకు గుంటూరు నుంచి పోటీ చేయడం ఇష్టం లేక శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలో తెలుగు దేశం పార్టీలో చేరేందుకు శ్రీకృష్ణదేవరాయలు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో నరసరావుపేట నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు వైసీపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పలువురి పేర్లను పరిశీలించిన జగన్.. చివరికి అనిల్ కుమార్ యాదవ్‌ను బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారు.

అయితే అనిల్ కుమార్ యాదవ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తే.. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ కానుంది. ఈక్రమంలో ఆ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్త అభ్యర్థి కోసం జగన్ వెతుకులాట మొదలు పెట్టారు. ఇప్పటికే పలువురి పేర్లను జగన్ పరిశీలించారు. చివరికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డిని బరిలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నారట.

శ్రీకృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ రెడ్డి.. తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీ తరుపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రశేఖర్ టీడీపీ అభ్యర్థిపై  ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు నెల్లూరు సిటీ అసెంబ్లీపై మంచి పట్టు ఉంది. అలాగే ప్రజా బలం కూడా గట్టిగానే ఉంది. ఈక్రమంలో అనిల్ కుమార్ యాదవ్ స్థానంలో చంద్రశేఖర్ రెడ్డిని పోటీ చేయిస్తే గెలిచి తీరుతారని జగన్ భావిస్తున్నారట. అందుకే ఆయన్ను నెల్లూరు సిటీ నుంచి బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + nine =