వైసీపీ సర్కార్‌కు షాక్.. చంద్రబాబుకు ఊరట

Chandrababu, Supreme Court, Relief for Chandrababu in the Supreme Court, Chandrababu naidu, TDP, Amaravathi Inner ring road case, AP, Andhra Pradesh Government, Andhra Pradesh, High Court, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, Mango News Telugu, Mango News
Chandrababu naidu, TDP, Amaravathi Inner ring road case, AP

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కొద్దిరోజుల క్రితం వరుస కేసులు వెంటాడిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్, లిక్కర్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులతో పాటు మరికొన్ని కేసులను ఏపీ సీఐడీ చంద్రబాబు నాయుడుపై నమోదు చేసింది. ఈ కేసులకు సంబంధించి చంద్రబాబు జైలు జీవితం కూడా గడిపారు. 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యం బారిన పడడంతో.. షరతులతో కూడిన బెయిల్‌పై బయటకొచ్చారు. అప్పటి నుంచి వరుసగా అన్ని కేసుల్లోనూ చంద్రబాబుకు ఊరట లభిస్తోంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేల చంద్రబాబుకు అన్ని కేసుల్లోనూ ఉపషమనం లభిస్తోంది.

తాజాగా సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని పిటీషన్ దాఖలు చేసింది. ఆ పిటీషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం దర్యాప్తు జరిపింది. చివరికి చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ కల్పిస్తూ.. ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని గతంలో వైసీసీ సర్కార్ ఆరోపించింది. ఈ మేరకు ఏపీ సీఐడీ చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణలపై కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసులో సీఐడీ అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో.. చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. అటు హైకోర్టు కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూర్ చేసింది. ఈక్రమంలో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ మేరకు చంద్రబాబు ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకోకుండానే హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిందని పిటీషన్‌లో పేర్కొంది. ఈక్రమంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. చివరికి చంద్రబాబుకు మద్ధతుగా తుది తీర్పు వెలువరించింది. చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ మేరకు ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + eighteen =