సోషియో ఎకనామిక్ సర్వే 2022-23ను విడుదల చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Released Socio Economic Survey Report 2022-23,AP CM YS Jagan Released Survey Report,AP Socio Economic Survey Report,AP Survey Report 2022-23,AP CM YS Jagan,Mango News,Mango News Telugu,Andhra Pradesh CM YS Jagan Mohan Reddy,YS Jagan releases Socio Economic Survey,Andhra Pradesh Posts a Growth of 16.22%,AP Logs GSDP Growth at 16.22%,Andhra Pradesh Latest News,Andhra Pradesh Latest News and Updates,AP Survey Report Latest News,AP Socio Economic Survey News Today,Andhra Pradesh Survey Live News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం శాసనసభలోని తన కార్యాలయంలో సోషియో ఎకనామిక్ సర్వే/ సామాజిక ఆర్థిక సర్వే 2022-23ను విడుదల చేశారు. అనంతరం 2022-23 సామాజిక ఆర్థిక సర్వే వివరాలను రాష్ట్ర ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. ఏపీలో రూ.13.17 లక్షల కోట్లు జీఎస్‌డీపీ నమోదు అయిందని, గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్‌డీపీ పెరిగిందన్నారు. కాగా 36 శాతం కంట్రీబ్యూషన్‌ వ్యవసాయం నుంచి, 64 శాతం కంట్రీబ్యూషన్‌ పరిశ్రమలు, సర్వీస్‌ సెక్టార్ల నుంచి వస్తుందని చెప్పారు. సర్వే ప్రకారం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తుందని, ప్రగతిలో ఏపీ నెంబర్‌ వన్‌ గా నిలిచిందని తెలిపారు. అలాగే దేశం మొత్తం యావరేజీ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని, వ్యవసాయంలో 13.18 శాతం, పరిశ్రమల రంగంలో 16.36 శాతం, సేవా రంగంలో 18.91 శాతం వృద్ధి నమోదైందని ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − ten =