ఇబ్రహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటనలో బాధ్యులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు

Telangana Govt Takes Severe Action Against Ibrahimpatnam Family Planning Operations Incident, Four Women Die After Family Planning Surgery , TS Botched Surgeries Failed, Ibrahimpatnam Botched Surgeries, 4 Women Die After Botched Up Family Planning Surgery, Family Planning Surgery, Mango News, Mango News Telugu, Telangana Govt Severe Action on Ibrahimpatnam Family Planning Operations Incident, Ibrahimpatnam Tragedy, Ibrahimpatnam Botched Surgeries Tragedy, Ibrahimpatnam Botched Surgeries Latest News And Updates, Ibrahimpatnam Botched Surgeries

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలతో పాటు మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్‌ ఝాన్సీ లక్ష్మిలను బదిలీ చేయగా, మరో 11 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అలాగే ఈ ఆపరేషన్లు నిర్వహించిన డాక్టర్‌ జోయల్ సునీల్ కుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. కాగా ఆగస్టు 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేశారు. అయితే ఆపరేషన్​ వికటించి వీరిలో నలుగురు మహిళలు మృతి చెందారు.

ఇది రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈ ఘటనపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో కమిటీని నియమించి విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం కమిటీ ఇందులో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చర్యలు చేపట్టింది. ఇబ్రహీంపట్నం ఘటనలో.. డీపీఎల్‌ క్యాంపు ఆఫీసర్ డాక్టర్ నాగజ్యోతి, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ గీత, హెడ్ నర్స్ చంద్రకళతోపాటు మాడుగుల పీహెచ్‌సీ డాక్టర్ శ్రీనివాస్, సూపర్‌వైజర్లు అలివేలు, మంగమ్మ, మంచాల పీహెచ్‌సీ డాక్టర్ కిరణ్, సూపర్‌వైజర్ జయలత, దండుమైలారం పీహెచ్‌సీ డాక్టర్ పూనం, సూపర్‌వైజర్ జానకమ్మ తదితరులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వహణ విషయంలో జారీ చేసిన మార్గదర్శకాలు..

  • నాణ్యత ప్రమాణాలను అనుసరించి ఒకరోజు ఒక ఆస్పత్రిలో 30కి మించి కు.ని ఆపరేషన్లు చేయరాదు.
  • కు.ని ఆపరేషన్లు నిర్ణయించిన రోజునే చేయాలి. అలాగే ఆపరేషన్ తర్వాత ఆ మహిళను 24 గంటల పాటు తప్పనిసరిగా అబ్జర్వేషన్‌లో ఉంచాలి.
  • డిశ్చార్జ్ అయిన పేషెంట్‌ను సంబంధిత ఆసుపత్రి సూపర్ వైజర్ 24 గంటల్లోగా ఒకసారి, వారంలోగా మరో రెండు సార్లు వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి.
  • పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ కూడా వారి పరిధిలో ఆపరేషన్ చేయించుకున్న వారందరినీ రెండు రోజుల్లోగా వెళ్లి పరిశీలించాలి. ఇక పేషెంట్ సంబంధిత సూపర్ వైజర్ పేషెంట్లను మానిటర్ చేస్తున్నారా లేదా అనేది మెడికల్ ఆఫీసర్ చూసుకోవాలి.
  • ప్రీ ఆపరేటివ్, ఇంట్రా ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ ప్రమాణాలు పాటించేలా ఆస్పత్రి సూపరింటెండెంట్, సర్జన్, డీపీఎల్ క్యాంపు ఆఫీసర్ బాధ్యత వహించాలి.
  • ఆపరేషన్ల తర్వాత తలెత్తే సమస్యలపై సూపర్ వైజర్లకు ఎప్పటికపుడు శిక్షణ తరగతులు నిర్వహించాలి. అలాగే ఏడాదికి ఒకసారి డీపీల్ సర్జన్ల నైపుణ్యతను అంచనా వేసే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  • ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ఛైర్మెన్‌గా ఉన్న సూపరింటెండెంట్లు ప్రతి సోమవారం ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణ మీద సమీక్ష చేయాలి.
  • ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల్లో ఇన్ఫెక్షన్ నివారణ ప్రమాణాలు విధిగా పాటించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here