అనకాపల్లి అభ్యర్దుల పైనే అందరి చూపు?

All Eyes on Anakapalli Candidates?, All Eyes on Anakapalli, Anakapalli, CM Ramesh, Anakapalli Candidates,TDP, Janasena, YCP, Congress, BJP, Mutyala Naidu, Erla Anuradha, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
CM Ramesh,Anakapalli candidates,TDP, Janasena, YCP, Congress, BJP, Mutyala Naidu, Erla Anuradha

ఏపీలో 3 పార్టీల ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన అభ్యర్దుల పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వైఎస్పార్సీపీ ఇప్పటికే అభ్యర్దులను ఖరారు చేసినా కూడా అనకాపల్లి ఎంపీ స్థానాన్ని మాత్రం ఖరారు చేయలేదు. ఎన్డీఏ కూటమి నుంచి ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించినా అభ్యర్ధిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సీటు కోసం సీఎం రమేష్, జీవీఎల్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సీఎం రమేష్ పోటీ చేస్తే వైఎస్సార్సీపీ నుంచి ఎవరిని బరిలోకి దించాలనే అంశం పైన ఏపీ సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు.

ఇటు  విశాఖ సీటును బీజేపీ నేతలు కోరుతున్నా కూడా దానికి  చంద్రబాబు సిద్దంగా లేరు. దీంతో అనకాపల్లి స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. అయితే అక్కడ నుంచి పార్టీ నేతలు జీవీఎల్ నర్సింహారావు, సీఎం రమేష్ పోటీ పడుతుండగా..  సీఎం రమేష్ కు దాదాపుగా ఖాయమవుతుందనే ప్రచారం సాగుతోంది.

మొత్తం 25 ఎంపీ స్థానల్లో అనకాపల్లి మినహా అన్ని స్థానాలకు వైఎస్పార్సీపీ  తమ అభ్యర్దులను ప్రకటించింది. సీఎం రమేష్ సొంత జిల్లా కడప. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేతగా సీఎం రమేష్ కు పేరుంది. బీసీ, కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండటంతో ఈ నియోజకవర్గం ముందు జనసేనకు కేటాయించారు. అక్కడ నుంచి మెగా బ్రదర్ నాగబాబును పోటీ చేయించాలని అనుకున్నారు. బీజేపీతో పొత్తు చర్చల్లో భాగంగా జనసేన ఈ సీటును బీజేపీకి వదలేసింది.

ఇటు వైఎస్సార్సీపీ నుంచి బీసీ అభ్యర్దినే బరిలోకి దించడానికి సీఎం జగన్ అనుకుంటున్నారు. గతంలో అనకాపల్లి లోని ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పని చేసి..తాజాగా సీటు రాకపోవడంతో  టీడీపీకి రాజీనామా చేసిన బీసీ నేత వైఎస్సార్సీపీతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లను కూడా జగన్ పరిశీలన చేస్తున్నారు. అయితే వీరిలో ఒక మహిళా నేత పేరు కూడా వినిపిస్తోంది.

డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడును అనకాపల్లి ఎంపీగా బరిలోకి  దింపితే ఎలా ఉంటుందని కూడా సీఎం  జగన్ సర్వే చేయిస్తున్నారు. అయితే  ముత్యాల నాయుడును ఎంపీగా పోటీ చేయించి.. మాడుగల సీటును ఆయన కూతురు ఈర్ల అనురాధకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు  పార్టీ బీసీ సెల్ కార్యదర్శి.. గవర సామాజిక వర్గానికి చెందిన మరో నేత .. కాశీ విశ్వనాధం పేరు కూడా వినిపిస్తుంది. అనకాపల్లికి చెందిన విశ్వనాధం..ఇప్పుడు నర్సీపట్నం పార్టీ పరిశీలకుడుగా పని చేస్తున్నారు. మొత్తంగా కూటమి నుంచి అభ్యర్ది పేరు అధికారికంగా ప్రకటన చేయగానే తమ  అభ్యర్దిని ప్రకటించడానికి జగన్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 13 =