వారిద్దరిలో ఎవరు గెలుస్తారనే చర్చ

Uncle, Sons In Law As Opponents In Pedakurapadu, Opponents In Pedakurapadu, Pedakurapadu Uncle and Sons In Law, Uncle, Sons In Law,Pedakurapadu,Nambur Shankar Rao, Kommalapati Sridhar, Bhashyam Praveen, TDP, Janasena, YCP, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Uncle, sons-in-law,Pedakurapadu,Nambur Shankar Rao, Kommalapati Sridhar, Bhashyam Praveen TDP, Janasena, YCP,

ప్రతీ ఎన్నికల సమయంలోనూ ఒకే కుటుంబం నుంచి ప్రత్యర్థులుగానో..లేక వేరే వేరు నియోజకవర్గాల నుంచి పోటీ పడటమో చూస్తూనే ఉంటాం.  ఇప్పుడు అలాంటి సీనే పెదకూరపాడు రాజకీయాల్లో కనిపిస్తోంది. పెదకూరపాడు నుంచి  మామ అల్లుళ్లే పోటీ చేయడంతో అక్కడ రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. అయితే మామ వైఎస్సార్సీపీ నుంచి  పోటీ చేస్తుండగా.. అల్లుడు టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు.

పెద్దకూరపాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇప్పుడు నంబూరు శంకర్ రావు ఉన్నారు. శంకర్ రావుకు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి చాలా కాలం పాటు కొమ్మాలపాటి శ్రీధర్ కొనసాగుతున్నారు. 2024 లో జరుగుతున్న ఈ ఎన్నికల్లోరూ  వీరిద్దరి మధ్యే ఫైట్ ఉంటుందని అంతా అనుకున్నారు.కానీ అనూహ్యం భాష్యం ప్రవీణ్ పేరు టీడీపీ తెరపైకి వచ్చింది.

చిలకలూరిపేట సీటు ఆశించిన భాష్యం ప్రవీణ్‌ను పెదకూరపాడు నుంచి బరిలోకి దింపడానికి  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 2009, 2014 ఎన్నికల్లో పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి వరుసగా విజయాన్ని సాధించారు. 2019లో మాత్రం నంబూరు శంకర్ రావుపై ఓటమి పాలవ్వడంతో.. ఈసారి అభ్యర్థిని మార్చాలనే నిర్ణయాన్ని  చంద్రబాబు తీసుకున్నారు.

అందుకే శంకర్ రావు ప్లేసులో భాష్యం ప్రవీణ్‌ను పెదకూరపాడు అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు.  వైఎస్సార్సీపీ నుంచి ఇప్పుడు  పోటీలో ఉన్న ఎమ్మెల్యే శంకర్ రావు, తెలుగు దేశం పార్టీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఇద్దరూ మామా అల్లుళ్లు. పైగా ఇద్దరిదీ కూడా తాడికొండ మండలం పెదపరిమినే. అయితే ఈ సారి జరగనున్న ఎన్నికలలో మామ అల్లుళ్ల మధ్యే ఫైట్ జరుగుతుండటంతో.. వారి బంధుగణంతో పాటు కుల సమీకరణలు ఎలా ఉంటాయి ఎవరి పక్షాన నిలుస్తారనే చర్చ  గుంటూరు జిల్లాలో జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 18 =