ఏపీలో ‘పెగాసెస్ స్పై వేర్’ పై హౌస్ కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భూమన కరుణకర్ రెడ్డి

Andhra Pradesh Assembly Set Up House Committee on Pegasus Spyware Issue, House Committee on Pegasus Spyware Issue, Bhumana Karunakar Reddy, MP Bhumana Karunakar Reddy, Chairman Bhumana Karunakar Reddy, Pegasus Spyware Chairman Bhumana Karunakar Reddy, Pegasus Spyware Issue, Pegasus Spyware Issue In AP, AP Pegasus Spyware Issue, Andhra Pradesh Assembly, AP Assembly, Pegasus Spyware Issue Latest News, Pegasus Spyware Issue Latest Updates, Pegasus Spyware Issue Live Updates, Pegasus Spyware, AP Assembly To Set Up House Committee on Pegasus Spyware Issue, Andhra Pradesh, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘పెగాసెస్ స్పై వేర్’ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు అసెంబ్లీ హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో పెగాసెస్‌ టెక్నాలజీ ఉపయోగించారని, దీనిపై విచారణ జరగాలని వైసీపీ సభ్యులు ఇటీవల సభలో కోరారు. అప్పటి ప్రతిపక్ష వైసీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. దీంతో స్పైవేర్‌ ఉదంతంపై హౌస్‌ కమిటీ ఏర్పాటు చేయాలని సోమవారమే అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అసెంబ్లీలో చర్చ సందర్భంగా త్వరలోనే దీనిపై ఒక కమిటీ వేస్తామని ప్రకటించారు. అయితే పెగాసెస్ ఆరోపణలను ప్రతిపక్ష టీడీపీ ఖండించింది. దీనిపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు.

ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం నాడు పెగాసెస్‌ వ్యవహారంపై స్పీకర్‌ హౌస్‌ కమిటీ వేశారు. ఈరోజు దానికి సంబంధించి హౌస్‌ కమిటీ వేస్తున్నట్లుగా ప్రకటన చేశారు. కాగా ఈ కమిటీకి చైర్మన్‌గా సీనియర్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు. అలాగే అమర్నాథ్‌, నాగార్జున, భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థసారధి, గిరిధర్‌ లను కమిటీ సభ్యులుగా నియమించారు. కాగా రాష్ట్రంలో పెగాసెస్‌ స్పైవేర్‌ వ్యవహారం గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసెస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో దుమారం రేపటం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 1 =