క్వారంటైన్ లోకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

coronavirus india, coronavirus news, Janasena, janasena chief pawan kalyan, Janasena Chief Pawan Kalyan Goes Into Self Quarantine, Mango News, pawan kalyan, pawan kalyan coronavirus, Pawan Kalyan goes into quarantine, Pawan Kalyan goes into self-isolation, Pawan Kalyan goes into self-quarantine, Pawan Kalyan in self-quarantine, Pawan Kalyan in self-quarantine after Janasena party Members Test Positive, Vakeel Saab actor Pawan Kalyan, Vakeel Saab actor Pawan Kalyan goes into self-isolation

జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. “జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ల సూచనతో పవన్ కళ్యాణ్ క్వారంటైన్ కు వెళ్లారు. గత వారం రోజులుగా ఆయన పరివారంలోని ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన క్వారంటైన్ కు వెళ్లారు. డాక్టర్ల సూచనతో ఆయన ప్రశాంత వాతావరణంలో ఉంటున్నారు. రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు” అని ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =