టీఎస్ టెట్-2022 కు రేప‌టి నుంచే ద‌ర‌ఖాస్తుల స్వీక‌రణ‌, టెట్ కు హాజరయ్యేందుకు వారూ కూడా అర్హులే…

Full Details About Telangana Teacher Eligibility Test-2022, Telangana Teacher Eligibility Test-2022, 2022 Telangana Teacher Eligibility Test, Telangana Teacher Eligibility Test, Telangana TET Notification Released Exam will be Held on June 12, Telangana TET Notification Released, Telangana TET Exam will be Held on June 12, Telangana TET, TS TET Notification 2022, 2022 TS TET Notification, Telangana TET Notification 2022, 2022 Telangana TET Notification, Telangana State Teacher Eligibility Test, State Teacher Eligibility Test, Telangana TET Exam, TET Exam, TS TET 2022 Live Updates, 2022 TS TET Live Updates, TS TET Live Updates, TS TET Latest Updates, TS TET Latest News, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్/ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ను జూన్ 12న నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ టెట్-2022 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్, సమాచార బులెటిన్ ను https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. టీఎస్ టెట్-2022 పరీక్షకు హాజరుకావడానికి అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అలాగే పేపర్-I లేదా పేపర్-II లేదా రెండు పేపర్‌లకు కలిపి కూడా ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.300ను ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్ ద్వారా లో వెబ్ సైట్ లో మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 11 వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఫీజు చెల్లింపు సమయంలో అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారా లేదా?, మొబైల్ ఫోన్ నంబర్ వంటి ప్రాథమిక డేటాను అందించాలని సూచించారు. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు రసీదుపై, అభ్యర్థికి ‘జర్నల్ నంబర్’ జారీ చేయబడుతుందని, దాని ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు.

ఇక టీఎస్ టెట్-2022 పరీక్షకు హాజరయ్యేందుకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ), డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థులకు కూడా అవ‌కాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. అయితే అభ్యర్థి అవసరమైన అర్హతను పొందితే తప్ప ఈ టెట్ సర్టిఫికేట్‌తో ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరు కాకూడదనే షరతుకు లోబడి ఉండాలని పేర్కొన్నారు. 2017 టెట్ సిల‌బ‌స్ ప్ర‌కార‌మే ఈసారి కూడా టెట్ ప‌రీక్షలు జరగనున్నాయి. మరోవైపు జూన్ 6 నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. జూన్ 12వ తేదీన ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-I, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్-II పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక టెట్ ఫలితాలను జూన్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − twelve =