ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులు నియామకం

Andhra Pradesh Govt Appoints In-charge Ministers for 26 Districts, Andhra Pradesh district New incharge ministers appointed, AP CM YS Jagan Appointed In-Charge Ministers for 26 Districts, AP Districts In-Charge Ministers List, AP government appointed district incharge ministers for 26 Districts, In-charge Ministers, In-charge Ministers for 26 Districts, Andhra Pradesh, Andhra Pradesh In-charge Ministers, Andhra Pradesh In-charge Ministers for 26 Districts, new reshuffled Cabinet Ministry of Andhra Pradesh, Andhra Pradesh Cabinet, Cabinet reshuffle, AP Cabinet reshuffle News, AP Cabinet reshuffle Latest News, AP Cabinet reshuffle Latest Updates, AP Cabinet reshuffle Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు 26 జిల్లాలకు ఇంచార్జి మంత్రులును ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంచార్జి మంత్రులు సమీక్ష జరిపి, పర్యవేక్షణ చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జిల్లాల వారీగా ఇంచార్జి మంత్రులు:

  1. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు – గుంటూరు
  2. మత్స, పశుసంర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పల రాజు – కాకినాడ
  3. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ – శ్రీకాకుళం
  4. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న దొర – అనకాపల్లి
  5. పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ – అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం
  6. పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు – విజయనగరం
  7. రోడ్లు, భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా – పశ్చిమగోదావరి
  8. రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ – ఏలూరు
  9. ఐ అండ్ పీఆర్, సినిమాటోగ్రపి, బీసీ సంక్షేమం శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ – తూర్పుగోదావరి
  10. హోమ్ శాఖ మంత్రి తానేటి వనిత – ఎన్టీఆర్
  11. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు – పల్నాడు
  12. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ – బాపట్ల
  13. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ – అమలాపురం
  14. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున – ఒంగోలు
  15. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని – విశాఖపట్నం
  16. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు – నెల్లూరు
  17. మున్సిపల్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ – కడప
  18. వ్యవసాయం, సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి – అన్నమయ్య
  19. విద్యుత్, ఫారెస్ట్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – అనంతపురం
  20. టూరిజం, యువజన, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా – కృష్ణా
  21. ఆబ్కారీ/ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణ స్వామి – తిరుపతి
  22. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా – నంద్యాల
  23. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి – కర్నూల్
  24. కార్మిక, ఉపాధి, శిక్షణా శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం – శ్రీ సత్యసాయి
  25. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ – చిత్తూరు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =