ఏపీలో రేపటినుంచే పదో తరగతి పరీక్షలు, అన్ని ఏర్పాట్లు పూర్తి…

Andhra Pradesh Tenth Class Public Exams-2022 to Start From Tomorrow All Arrangements Completed, Tenth Class Public Exams-2022 to Start From Tomorrow, All Arrangements Completed For Tenth Class Public Exams-2022, Tenth Class Public Exams-2022, 2022 Tenth Class Public Exams, AP Tenth Class Public Exams, AP SSC Exams, Andhra Pradesh Tenth Class Public Exams-2022, Andhra Pradesh Tenth Class Public Exams-2022 Starts From Tomorrow, AP Tenth Class Public Exams, Andhra Pradesh 10th examination is going to start from Tomorrow, AP Tenth Class Public Exams News, AP Tenth Class Public Exams Latest News, AP Tenth Class Public Exams Latest Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రేపటి (ఏప్రిల్ 27, బుధవారం) నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పది పరీక్షలకు ఈసారి మొత్తం 6,22,537 మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఇందులో 3,20,063 మంది బాలురు, 3,02,474 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3800 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. అలాగే ఈ ఏడాది పదో తరగతిలో ఏడు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించడంతో పాటుగా, తొలిసారిగా సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ ను అందిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటల కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, 9.30 గంటల తర్వాత లోపలికి అనుమతి ఉండదని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద భౌతికదూరం పాటించడం, మాస్కు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలు అమలు చేయనున్నారు. ఇక ఈ ఏడాది పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థులకు పరీక్షకు వెళ్లేప్పుడు, వచ్చేప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం కల్పించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + twenty =